📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sanju Samson: మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయంలో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీ హైలైట్‌గా నిలిచింది.పవర్ ప్లేలోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కివీస్ బౌలర్లను వణికించారు. ఈ మ్యాచ్‌లో సంజూ 89 పరుగులు చేయగా, అభిషేక్ కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ముగింపులో సంజూ సరదాగా ఒక సలహా ఇస్తూ.. “భాయ్.. ఇక నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకో” అంటూ అభిషేక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

Read Also: Abrar Ahmed NOC: పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

మేము ‘నిప్పు-నీరు’ కాదు.. ‘నిప్పు-నిప్పు’ (Fire and Fire)!

విజయం అనంతరం ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా సంజూ శాంసన్ తమ ఓపెనింగ్ కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “చాలా మంది మా కాంబినేషన్‌ను ఫైర్ అండ్ ఐస్ (నిప్పు-నీరు) అనుకుంటారు. కానీ నిజానికి అది నిప్పు-నిప్పు (Fire and Fire) కాంబినేషన్” అని సంజూ వ్యాఖ్యానించడం విశేషం.

Sanju Samson: Communication between us is very simple

మ మధ్య ఉన్న బంధం గురించి సంజూ మాట్లాడుతూ.. “మా మధ్య కేరళ-పంజాబీ స్నేహం ఉంది. మా భాగస్వామ్యం చాలా సింపుల్‌గా ఉంటుంది. బంతి ఎలా వస్తోంది? అని అభిషేక్ నన్ను అడుగుతాడు. బానే వస్తోంది, సిక్సర్ కొట్టు అని నేను చెబుతాను. అంతకు మించి మేం దేన్నీ కాంప్లికేట్ చేయం” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. అభిషేక్ శర్మ ధైర్యాన్ని, అతని క్యారెక్టర్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానని సంజూ పేర్కొన్నారు.

అభిషేక్ శర్మ కూడా తన లక్ష్యాల గురించి స్పష్టతనిచ్చారు. టోర్నీలో తనకు అనుకున్న ఆరంభం లభించకపోయినా, అంతిమంగా ట్రోఫీ గెలవడం తన కల అని ఆయన తెలిపారు. “ఒక్క ప్రపంచకప్‌తోనే నేను సంతృప్తి చెందను. దేశం కోసం మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం” అని తన ఆశయాలను చాటారు. ఈ టోర్నీలో సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

abhishek sharma India vs New Zealand Sanju Samson T20 World Cup 2026 final

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.