📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: రోహిత్, కోహ్లీ ర్యాంకులు పదిలం: బీసీసీఐ

Author Icon By Anusha
Updated: May 14, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు షాకిచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు.కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. కోహ్లీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వెలువడినా అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. విరాట్, రోహిత్ శర్మలు టెస్టులు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్లకు ‘ఏ ప్లస్’ కాంట్రాక్ట్(‘A plus’ contract) కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. వారిద్దరు భారత క్రికెట్‌లో భాగమయ్యారని, ఏ ప్లస్ సౌకర్యాలు గతంలో మాదిరే లభిస్తాయని ఆయన తెలిపారు. సాధారణంగా మూడు ఫార్మాట్లలో అందుబాటులో ఉండే వారికే ఏ ప్లస్ గ్రేడ్ వర్తిస్తుంది.ఇదిలా ఉండగా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది.

రోహిత్, కోహ్లీ ర్యాంకులు పదిలం: బీసీసీఐ

టీమిండియా

అయితే ఈ పర్యటనకు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా అవకాశం లేదని సెలెక్టర్లు చెప్పడంతోనే రోహిత్ శర్మ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్(Fittest cricketer) అయిన విరాట్ కోహ్లీ తనకు నచ్చిన ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం అందర్నీ అయోమయానికి గురి చేసింది.విరాట్ కోహ్లీ లేని లోటు టీమిండియాలో కనబడనుంది. అయితే ఈ ఇద్దరి దిగ్గజాలను ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్ట్‌కు బీసీసీఐ(BCCI) ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 20న లీడ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు హాజరయ్యే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా వారికి గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మలను ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్ట్‌కు హాజరవ్వాలని ప్రత్యేకంగా కోరనుందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని అనిల్ కుంబ్లే వంటి మాజీ ఆటగాళ్లు బీసీసీఐకి సూచిస్తున్నారు.

Read Also : Kohli: శ్రేయస్ అయ్యర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం ఎందుకంటే?

#APlusContract #BCCI #IndianCricket #rohitsharma #TeamIndia #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.