📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Rohit Sharma: తన సోదరుడిపై రోహిత్ ఆగ్రహం ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: May 17, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట ఓ కొత్త స్టాండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టాండ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మ‌లు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు రితికా సజ్దే, రోహిత్ సోదరుడు విశాల్ శర్మ, అతని సతీమణి కూడా హాజరయ్యారు.ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో కారు వెనుక భాగంలో సొట్ట పడటం చూసిన రోహిత్ శర్మ(Rohit Sharma) ఆగ్రహానికి గురయ్యాడు. యే క్యా హై అంటూ తమ్ముడు విశాల్‌పై హిట్ మ్యాన్‌ మండిపడ్డాడు. రివ‌ర్స్ తీసుకునే స‌మ‌యంలో డెంట్ పడిన‌ట్లుందని విశాల్ చెప్పగా మరింత కోపానికి గురైన రోహిత్ ‘ఎవ‌రి వ‌ల్లా , నీ వ‌ల్లే ఇదంతా’జ‌రిగిదంటూ తమ్ముడిపై అసహనం వ్యక్తం చేశాడు. రోహిత్ శ‌ర్మ పేరెంట్స్ గురునాథ్‌, పూర్ణిమా శ‌ర్మ‌, భార్య రితికా స‌జ్దే కూడా అక్క‌డే ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైరల్ కాగా ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కార్ లవర్స్ ఎవరూ డెంట్స్‌ను సహించరని, రోహిత్ శర్మ కూడా అదే చేశాడని పేర్కొంటున్నారు.రోహిత్ శర్మకు కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్ కార్ డ్రైవింగ్‌ను ఆస్వాదిస్తుంటాడు. అతి వేగంగా కారును నడపడం హిట్ మ్యాన్‌కు సరదా. గతంలో అతివేగంగా కారు నడిపిన రోహిత్ శర్మ పోలీసులు జరిమానా కూడా విధించారు.

అభ్యర్థన

రోహిత్ శర్మకు లంబోర్ఘిని ఉరుస్, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్5, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, మెర్సిడెస్-బెంజ్ GLS, రేంజ్ రోవర్ HSE LWB, BMW X3, మెర్సిడెస్ GLS 400d, టయోటా ఫార్చ్యూనర్, స్కోడా లారా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. రోహిత్ శర్మ తన కార్లను చాలా అపురూపంగా చూసుకుంటాడు. చిన్న గీత పడినా తట్టుకోలేడు.కారు వెనుక భాగంలో సొట్ట పడటం చూసిన రోహిత్ శర్మ ,తన తమ్ముడు విశాల్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొన్నేళ్ల క్రితమే, రోహిత్ అభ్యర్థన మేరకు విశాల్ శర్మ(Vishal Sharma) హాస్పిటాలిటీ రంగంలోని తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్రికెట్ అకాడమీని చూసుకుంటున్నాడు. భారత్‌, సింగపూర్‌లో రోహిత్ శర్మ పేరిట ఉన్న క్రికెట్ అకాడమీలను పర్యవేక్షిస్తున్నాడు.అంతేకాకుండా రోహిత్ శర్మకు సంబంధించిన పలు వ్యాపారాలను కూడా నడిపిస్తున్నట్లు సమాచారం. విశాల్ శర్మ మీడియాకు దూరంగా ఉంటాడు. రోహిత్‌తో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తాయి.

Read Also : MS Dhoni: ధోని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్

#BMWM5 #CarLovers #LamborghiniUrus #LuxuryCars #MercedesBenz #rohitsharma Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.