📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Rishab Pant: ఈ టోర్నీలో మాకు అవకాశాలు చాలా వచ్చాయన్న రిషభ్ పంత్

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు(Play offs race) నుంచి తప్పుకున్న లక్నో ఓదార్పు విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రిషభ్ పంత్(Rishab Pant) టాప్-3 బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్‌తోనే గెలుపొందామని తెలిపాడు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు.ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. మంచి క్రికెట్ ఆడటం గురించి మేం తరుచూ మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. ఈ టోర్నీలో మాకు అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. అయితే గెలుపు ఓటములు ఆటలో ఒక భాగం. గుజరాత్ టైటాన్స్ టాప్ -3 బ్యాటర్లను అడ్డుకోవడం ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమే, కానీ షారూఖ్ ఖాన్ తన బ్యాటింగ్‌తో తమ జట్టుకు ఆశలు రేపాడు.

బ్యాటింగ్

అయితే చేధించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉందనే విషయం మాకు తెలుసు. బౌలర్లు కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బౌలింగ్ చేశారు. ఈ టోర్నీనీ ప్రారంభించేటప్పుడే మమ్మల్ని గాయాల బెడద వెంటాడింది. వాటి గురించి మాట్లాడకూడదనుకున్నాం. ఈ టోర్నీలో బ్యాటింగ్ విభాగం రాణించింది. కానీ ఫీల్డింగ్‌లో కొద్దిగా వెనుకబడ్డాం. మా ఓటమికి సాకులు చెప్పడం లేదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోని ముందుకు సాగాలనుకుంటున్నాం.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117) సెంచరీతో చెలరేగగా నికోలస్ పూరన్(27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

Rishab Pant:

రూథర్‌ఫోర్డ్

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓటమిపాలైంది. షారుఖ్ ఖాన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 35), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 38) రాణించాడు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(3/27) మూడు వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్(2/51), ఆయుష్ బదోని(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో ఓదార్పు విజయాన్నందుకుంది.

Read Also: LSG vs GT: గుజరాత్ టైటాన్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే?

#IPL2025 #LSGvsGT #LucknowSuperGiants #RishabhPant Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.