📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు

Rinku Singh: ఈ నెల 8న ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ క్రికెటర్‌ రింకు సింగ్‌, మచ్లిషహర్‌ ఎంపీ ప్రియా సరోజ్‌ సింగ్ను వివాహం చేసుకోనున్నారు. వారిద్దరూ నవంబర్ 18న వివాహం చేసుకోబోతున్నారు. వారణాసిలోని హోటల్ తాజ్‌లో ఈ వివాహం జరగనుంది. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సమావేశం కానున్నారు.ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ జూన్ 8న లక్నో(Lucknow)లో జరగనుంది. అక్కడ ప్రియా సరోజ్, రింకూ సింగ్ ఉంగరాలు మార్చుకోనున్నారు. వారి వివాహ వార్తల నేపథ్యంలో వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్‌(Priya Saroj) తండ్రి కెరాకట్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.అలీగఢ్‌లో రింకు కుటుంబాన్ని కలిశానని ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ సభ్యులు వివాహానికి సిద్ధంగా ఉన్నారని ఐపీఎల్‌ తర్వాత వివాహం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్‌ వేడుక తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుందని.దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినీ తారలు హాజరవుతారన్నారు. ప్రియా సరోజ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా ప్రియా, రింకు ఇద్దరికి పరిచయం ఉంది. పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు సైతం అంగీకరించాయి.

Rinku Singh

కెరియర్‌

రింకు సింగ్ 1997 అక్టోబర్ 12న అలీఘఢ్‌లోని చాలా సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి ఖాంచంద్ర గ్యాస్ ఏజెన్సీ(Gas Agency)లో సిలిండర్లు పంపిణీ చేసేవాడు. రింకు సైతం తండ్రికి సహకారం అందిస్తుండే వాడు. పేదరికం నుంచి వచ్చినా క్రికెట్‌ను కెరియర్‌గా ఎంచుకొని టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో 2023 సీజన్‌లో కేకేఆర్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టీ20 క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో కేకేఆర్‌ రూ.13కోట్లకు రిటైన్‌ చేసుకుంది. రింకు సింగ్‌ని 2017లో కింగ్స్‌లెవెన్‌ పంజాబ్‌ రూ.10లక్షలు కొనుగోలు చేసింది. ఆ సమయంలో తుది జట్టులో చోటు దక్కలేదు. 2018 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.80 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది. ప్రస్తుతం రింకు వార్షిక ఆదాయం దాదాపు రూ.60 నుంచి రూ.80లక్షల ఆదాయం ఉంటుందని అంచనా. 2024 రింకు సింగ్ ఆస్తులు దాదాపు రూ.8 కోట్లుగా అంచనా.

Read Also: Nigeria: నైజీరియాలో రోడ్డు ప్రమాదం..21 మంది అథ్లెట్లు మృతి

#CricketerWedding #MPWedding #PriyaSarojSingh #RinkuSingh #WeddingBells Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.