Richard Pybus: అఫ్గనిస్తాన్ కొత్త హెడ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్ నియామకం

Read Time:  1 min
Richard Pybus: అఫ్గనిస్తాన్ కొత్త హెడ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్ నియామకం
FONT SIZE
GET APP

Richard Pybus: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) సరికొత్త ప్రయాణానికి సిద్ధమైంది. జట్టు నూతన హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన రిచర్డ్ పైబస్‌ను నియమిస్తున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) మంగళవారం ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2026 వరకు కోచ్‌గా వ్యవహరించిన జొనాథన్ ట్రాట్ తన పదవీకాలం ముగియడంతో తప్పుకున్నారు. ఆయన స్థానంలో పైబస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read Also: T20 WC 2026: టీమిండియాకు పాంటింగ్ కీలక సూచనలు

శ్రీలంక సిరీస్‌తో ప్రారంభం కానున్న పైబస్ శకం

వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ (ODI & T20I) నుంచి రిచర్డ్ పైబస్ అఫ్గన్ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. అఫ్గనిస్తాన్ జట్టు ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో, పైబస్ నియామకం జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. ఆటగాళ్లలో క్రమశిక్షణ, వ్యూహాలను పక్కాగా అమలు చేయడంలో ఆయనకు మంచి పేరుంది.

Richard Pybus appointed as Afghanistan's new head coach
Richard Pybus appointed as Afghanistan’s new head coach

కోచ్ గా మంచి రికార్డు

ఇక ఇంగ్లండ్ కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ‘ఎ’ మ్యాచ్ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా -అనుభవం లేకపోయినా.. కోచ్ గా మంచి రికార్డు ఉంది. పైబస్ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న సమయంలోనే కరీబియన్ జట్లు పురుషుల, మహిళల, అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్.. నాలుగింటికి రెండే మ్యాచ్ లు, గెలిచింది. తద్వారా సూపర్-8 చేరకుండానే -నిష్క్రమించింది. గత ఎడిషన్ లో, అఫ్గన్ జట్టు అనూహ్య రీతిలో సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.