📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Robin Uthappa: చెక్ బౌన్స్ కేసులో రాబిన్ ఊతప్పకు ఊరట

Author Icon By Anusha
Updated: October 4, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప (Robin Uthappa) కు చెక్ బౌన్స్ కేసులో పెద్ద ఊరట లభించింది. ముంబై సెషన్స్ కోర్టు తాజా తీర్పుతో ఊతప్పపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఈ కేసులో కింది కోర్టు జారీ చేసిన సమన్లను సెషన్స్ కోర్టు రద్దు చేస్తూ, విచారణలో పలు విధానపరమైన లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అదే సమయంలో కేసును తిరిగి మజ్‌గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు పునఃపరిశీలన కోసం పంపింది.

 KL Rahul: టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

2019లో ఓ ప్రైవేట్ కంపెనీ జారీ చేసిన రూ. 22.22 లక్షల చెక్ నిధులు లేకపోవడంతో బౌన్స్ అయింది. ఈ ఘటనపై నమోదైన కేసులో, ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారన్న కారణంతో రాబిన్ ఊతప్ప పేరును కూడా చేర్చారు.

దీంతో మజ్‌గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు (Magistrate’s Court) ఆయనకు సమన్లు, ఆ తర్వాత వారెంట్లు జారీ చేసింది.ఈ ఆదేశాలను ఊతప్ప సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. తాను కంపెనీలో కేవలం పెట్టుబడిదారుడిని మాత్రమేనని, రోజువారీ కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.

Robin Uthappa

డైరెక్టర్ పదవికి తాను ఎప్పుడో రాజీనామా చేశానని

డైరెక్టర్ పదవికి తాను ఎప్పుడో రాజీనామా చేశానని, తన పెట్టుబడిని దుర్వినియోగం చేశారని ఆ కంపెనీపై బెంగళూరు (Bangalore) లో కేసు కూడా పెట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఊతప్ప తరఫు న్యాయవాదులు సిద్ధేష్ బోర్కర్, శివేంద్ర ద్వివేది కీలకమైన చట్టపరమైన అంశాన్ని ప్రస్తావించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 202 ప్రకారం, కోర్టు అధికార పరిధికి వెలుపల నివసించే వ్యక్తికి సమన్లు జారీ చేసే ముందు మేజిస్ట్రేట్ తప్పనిసరిగా విచారణ జరపాలని,

అనవసర వేధింపులను నివారించేందుకు ఈ నిబంధన ఉందని వాదించారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ ఆ విచారణ జరపలేదని ఎత్తిచూపారు.ఈ వాదనలతో ఏకీభవించిన అదనపు సెషన్స్ జడ్జి (Sessions Judge) కునాల్ డి. జాదవ్, మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లో చట్టపరమైన లోపం ఉందని నిర్ధారించారు.

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఇలాంటి విచారణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. “మేజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలు చట్ట ప్రకారం చెల్లవు” అని వ్యాఖ్యానిస్తూ, సమన్లను రద్దు చేశారు. ఈ కేసులో సరైన విచారణ జరిపిన తర్వాతే ముందుకు వెళ్లాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు. తాజా ఆదేశాలతో ఊతప్పకు ఈ కేసులో తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News cheque bounce 22.22 lakh Cheque Bounce Case latest news Mumbai sessions court relief robin uthappa Robin Uthappa summons cancelled Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.