📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB vs PBKS: ఐపీఎల్ ఫైనల్ వర్షం ఆటంకంగా మారేనా?

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక మ్యాచ్‌కు అంతరాయం కలిగితే పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌(Final match)కు వర్షం అడ్డుతగిలితే, తొలుత ఆటను పూర్తి చేయడానికి అధికారులు 120 నిమిషాల (రెండు గంటల) అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఈ అదనపు సమయాన్ని ఉపయోగించుకుని మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:56 గంటల వరకు కూడా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే, కనీసం చెరో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించి ఫలితాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఒక మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించడానికి అవసరమైన కనీస ఓవర్ల సంఖ్య.

నిర్వహించడం

ఒకవేళ పరిస్థితులు అనుకూలించక, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించడం సాధ్యపడని పక్షంలో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే, సమయం ఉన్నంత వరకు మరో సూపర్ ఓవర్, అదీ టై అయితే ఇంకో సూపర్ ఓవర్ చొప్పున ఆడిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా సూపర్ ఓవర్(Super Over) నిర్వహించడం కూడా అసాధ్యమైతే, అప్పుడు ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే అయిన బుధ‌వారం (జూన్ 4న) మ్యాచ్‌ను నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజున, అంతకుముందు రోజు మ్యాచ్ ఏ దశలో ఆగిపోయిందో, అక్కడి నుంచే కొనసాగిస్తారు.

కొద్దిసేపు

ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయివుంటే, రిజర్వ్ డే రోజున కొత్తగా మ్యాచ్ ప్రారంభిస్తారు.అత్యంత అరుదైన సందర్భంలో షెడ్యూల్డ్ రోజు (జూన్ 3), రిజర్వ్ డే (జూన్ 4) రోజు కూడా వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దయితే, అప్పుడు ఐపీఎల్(IPL) నియమావళి ప్రకారం లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది కాబట్టి, ఒకవేళ రెండు రోజులూ ఆట సాధ్యం కాకపోతే పీబీకేఎస్‌ను విజేతగా ప్రకటిస్తారు.అహ్మదాబాద్‌(Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం కొద్దిసేపు వర్షం పడే అవకాశం ఉంది. ఇక‌, క్వాలిఫ‌య‌ర్‌-2 కూడా వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఫైన‌ల్‌కు వ‌రుణుడు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని, పూర్తి మ్యాచ్ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నారు.  

Read Also: PBKS vs RCB : ట్రోఫీతో కెప్టెన్ల‌ ఫొటోషూట్‌

#IPL2025Final #PBKS #RCB #RCBvsPBKS Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.