📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB vs LSG :లక్నో పై ఆర్సీబీ ఘన విజయం

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం లక్నో వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.ఛేదనలో తాత్కాలిక సారథి జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్‌, 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులకు తోడు విరాట్‌ కోహ్లీ (30 బంతుల్లో 54, 10 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌ (23 బంతుల్లో 41 నాటౌట్‌, 5 ఫోర్లు) రాణించారు.మొదట బ్యాటింగ్‌(Batting) చేసిన లక్నోకు రిషభ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగగా మిచెల్‌ మార్ష్‌ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌-18లో లీగ్‌ దశ ముగిసింది. ఈ మ్యాచ్‌ ఫలితం అనంతరం బెంగళూరు, పంజాబ్‌ తలా 19 పాయింట్లతో సమానంగా ఉన్నా నెట్ రేట్‌ విషయంలో ఆర్‌సీబీ(RCB) రెండో స్థానానికి పరిమితమైంది. ఈనెల 29న పంజాబ్‌, బెంగళూరు క్వాలిఫయర్‌-1 ఆడనుండగా 30న జరిగే ఎలిమినేటర్‌లో గుజరాత్‌ ముంబైతో తలపడనుంది.

హాఫ్‌ సెంచరీ

లక్నో ఇన్నింగ్స్‌లో పంత్‌ ఇన్నింగ్సే హైలైట్‌. సీజన్‌ అంతా విఫలమైన అతడు ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తానేంటో నిరూపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ బ్రీట్జ్‌ (14) లక్నో స్కోరు 25 పరుగుల వద్దే ఔట్‌ అవడంతో క్రీజులోకి వచ్చిన పంత్‌ మార్ష్‌తో కలిసి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. వచ్చీరాగానే యశ్‌ దయాల్‌ 4వ ఓవర్లో 6, 4, 4తో బాదుడు మొదలుపెట్టిన పంత్‌(Rishab Panth) భువనేశ్వర్‌ ఓవర్లో 6, 4 దంచాడు. సుయాశ్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో 29 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. మరో ఎండ్‌లో మార్ష్‌ సైతం షెపర్డ్‌ బౌలింగ్‌ ఫోర్‌, సిక్సర్‌ కొట్టగా, సుయాశ్‌ ఓవర్లో సిక్స్‌తో ఈ సీజన్‌లో 7వ హాఫ్‌ సెంచరీ నమోదుచేశాడు. ఈ క్రమంలో భువీ 16వ ఓవర్లో మార్ష్‌ను ఔట్‌ చేయడంతో లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. రెండో వికెట్‌కు పంత్‌-మార్ష్‌ ద్వయం 78 బంతుల్లోనే 152 పరుగులు జోడించింది. భువీనే వేసిన 18వ ఓవర్లో ఐదో బంతిని బౌండరీకి తరలించిన పంత్‌ 54 బంతుల్లో శతకాన్ని నమోదుచేశాడు.

RCB vs LSG :లక్నో పై ఆర్సీబీ ఘన విజయం

పెవిలియన్‌

ఛేదనలో బెంగళూరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెన్‌ ఫిల్‌ సాల్ట్‌ (30), కోహ్లీ లక్నో బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సాల్ట్‌ను ఆకాశ్‌ ఆరో ఓవర్‌లో పెవిలియన్‌కు పంపగా ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌(Impact player)గా వచ్చిన రజత్‌ పటీదార్‌ (14) విఫలమయ్యాడు. లివింగ్‌స్టొన్‌ డకౌట్‌ అవగా అర్ధ శతకం తర్వాత కోహ్లీ కూడా నిష్క్రమించడంతో బెంగళూరు శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ జితేశ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగి మ్యాచ్‌ను ముగించాడు. మయాంక్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు.

Read Also : BCCI: ఐపీఎల్ ముగింపు వేడుకలు దేశానికి అంకితం చేయనున్న బీసీసీఐ

#IPL2025 #LSGvsRCB #RCBvsLSG #RCBWin #T20Thriller Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.