📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB: ఆర్సీబీ ఘటనలో గవర్నర్‌,సీఎంల మధ్య ముదురుతున్న వివాదం

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఇప్పుడు కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య వివాదానికి దారితీసింది. విధాన సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించగా, దీనికి విరుద్ధంగా రాజ్‌భవన్ మరో ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రే అధికారికంగా ఆహ్వానించారని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.

ప్రధాన కార్యదర్శి

నిజానికి,తొలుత ఆర్సీబీ జట్టుకు రాజ్‌భవన్‌లోనే ఆతిథ్యం ఇవ్వాలని భావించారు. ఈ విషయంపై గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించి, కార్యక్రమ సమన్వయం చూడాలని కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే విధాన సౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎస్‌(CS) తెలియజేశారు.”విధాన సౌధలో నిర్వహించే ఆర్సీబీ ఆటగాళ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రే అధికారికంగా ఆహ్వానించారు” అని రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ప్రశాంతంగా

కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తోంది. తొక్కిసలాట చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium) వద్ద జరిగిందని, విధాన సౌధ వద్ద కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని ఆరోపించింది.

RCB

తొక్కిసలాట

మా ప్రభుత్వం ఈ తొక్కిసలాట కేసును తీవ్రంగా పరిగణిస్తోంది అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తెలిపారు. తాను ఈ కార్యక్రమానికి కేవలం ఆహ్వానితుడిని మాత్రమేనని, తొక్కిసలాట జరిగిన విషయం తనకు రెండు గంటలు ఆలస్యంగా తెలిసిందని చెబుతూ పోలీసుల సస్పెన్షన్‌ను సమర్థించుకున్నారు. విధాన సౌధలో జరిగిన వేడుకకు క్రికెట్‌ వర్గాల నుంచి ఆహ్వానం అందిందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదని ఆయన పేర్కొన్నారు. చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని కూడా సీఎం స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా

ఆర్సీబీ కార్యక్రమానికి ముందే అసెంబ్లీ భద్రతను పర్యవేక్షించే డీసీపీ ఎంఎన్‌ కరిబసవన గౌడ(DCP MN Karibasavan Gowda), సిబ్బంది, పరిపాలన సంస్కరణల కార్యదర్శి జి.సత్యవతి సహా పలువురు ఉన్నతాధికారులకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, ‘ఆ క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తే లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. సిబ్బంది కొరత కారణంగా వారిని నియంత్రించడం కష్టం’ అని ఆయన హెచ్చరించారు. స్టేడియంలోకి వచ్చేందుకు జారీ చేస్తున్న ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఎంట్రీ పాస్‌లను కూడా నిలిపివేయాలని ఆయన కోరారు.

Read Also: WTC Final 2025: రేప‌టి నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్..మరిన్ని వివరాలు

#GovernorVsCM #karnatakapolitics #RCBVictoryCelebration #siddaramaiah Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.