ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో తొలిసారి ట్రోఫీ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల్లో (RCB fans)ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఆర్సీబీ యాజమాన్యం పిలుపునిచ్చింది. అయితే, ఈ వేడుకలకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (CAT) స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆర్సీబీ యాజమాన్యమే ఈ దుర్ఘటనకు ప్రథమ దోషిగా నిలిచిందని ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది.
ఘటనకు దారితీసిన ఉత్సాహం
జూన్ 4న జరిగిన విజయోత్సవానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. టికెట్ల వ్యవస్థ లేకుండానే ఉచిత ప్రవేశం (Free entry) అందిస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా స్టేడియం గేట్ల వద్ద జనసంద్రము ఏర్పడింది. అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను ఓసారి చూడాలనే ఉత్సాహంతో ముందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. దీనిపై క్యాట్ స్పందిస్తూ ‘ప్రాథమికంగా చూస్తే ఇంత భారీ స్థాయిలో అభిమానులు తరలిరావడానికి ఆర్‌సీబీ (RCB) యాజమాన్యమే కారణం. ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలో విక్టరీ పరేడ్ పోస్ట్ పెట్టిన 12 గంటల్లోపే అభిమానులు చిన్నస్వామికి పోటెత్తారు.
అనుమతులు తీసుకోలేదు
ఆర్‌సీబీ ముందుగా పోలీసుల నుంచి పరేడ్‌కు అవసరమైన అనుమతులు తీసుకోలేదు. 35 వేల సామర్థ్యం గల స్టేడియానికి సుమారు 2 నుంచి 3 లక్షల మంది దాకా తరలిరావడంతో పోలీసులు వారిని అదుపుచేయలేకపోయారు. సమయాభావం వల్ల పోలీసులు (Police) సైతం అవసరమైన బలగాలను సమకూర్చుకోలేకపోయారు. పోలీసులేమీ దేవుళ్లు కాదు కదా, వాళ్లూ మానవ మాత్రులే. భారీగా వచ్చిన జనాలను అదుపుచేయడానికి వారిదగ్గర అల్లావుద్దీన్ ద్వీపం వంటిదేమీ లేదు. పోలీసులు పూర్తి సన్నద్దం అయ్యేందుకు సమయం ఇచ్చుంటే బాగుండేది’ అని వెల్లడించింది. దీనిపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఇంకా స్పందించలేదు.
Read Also: IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్..భారత్ ఫస్ట్ బ్యాటింగ్