Rahul Dravid: రోహిత్ శర్మ కెప్టెన్సీ‌తోనే ప్రపంచకప్ గెలిచాం

Read Time:  1 min
Rahul Dravid: రోహిత్ శర్మ కెప్టెన్సీ‌తోనే ప్రపంచకప్ గెలిచాం
FONT SIZE
GET APP

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో రోహిత్ శర్మ సెల్ఫ్‌లెస్ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పష్టం చేశారు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంపై స్పందించిన ద్రవిడ్, ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని ప్రతి ఆటగాడికే దక్కుతుందని అన్నారు. వ్యక్తిగత రికార్డులకన్నా జట్టు విజయాన్ని ముందుంచే రోహిత్ నాయకత్వమే ఈ ఘనతకు కారణమని ఆయన కొనియాడారు.

Read Also: IND vs NZ 4th T20I: టాస్ గెలిచిన టీమిండియా

వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత మరో ఐసీసీ టైటిల్‌‌ను అందుకుంది. ఈ విజయానంతరమే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.దాంతో అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సన్నదమైంది. ఈ వరల్డ్ కప్ సైకిల్‌లో సూర్య సేన ఆడిన 9 సిరీస్‌లకు 9 గెలిచి హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది.

అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఏ జట్టు వరుసగా టైటిళ్లు గెలవలేదు. అంతేకాకుండా ఆతిథ్య జట్టు ఇప్పటి వరకు టైటిల్ అందుకోలేదు. ఈ క్రమంలోనే భారత్ పటిష్టంగా ఉన్నా.. టైటిల్ గెలుస్తుందా? అంటే 100 శాతం అవును అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Rahul Dravid: We won the World Cup under Rohit Sharma's captaincy
Rahul Dravid: We won the World Cup under Rohit Sharma’s captaincy

ఒక్క బ్యాడ్ డే అంత తలకిందులు చేస్తుంది

తాజాగా రాహుల్ ద్రవిడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నా.. ఒక్క బ్యాడ్ డే అంత తలకిందులు చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే జట్లలో టీమిండియా హాట్ ఫేవరేట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈజీగా సెమీఫైనల్ చేరుకుంటుంది.

అయితే నా చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే.. జట్టు ఎంత బలంగా ఉన్నా.. మ్యాచ్ రోజు ఎంత బాగా ఆడుతారనేది ముఖ్యం. ఎవరైనా సరే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును దెబ్బతీయగలరు. భారత జట్టు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ, ఒక చెడు దినం అంతా తలకిందులు చేయగలదు.’అని రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.