ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తనకు సంజూ శాంసన్ కు మధ్య ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తామని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ సమయంలో అందరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. మరోవైపు స్కాన్ ఫలితాలు వచ్చిన తర్వాతే సంజు శాంసన్ ఆడతాడో లేదో తెలుస్తుందని రాహుల్ ద్రవిడ్ వివరించాడు.
బౌలింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆర్చర్ బౌలింగ్ చేయాలని సంజు శాంసన్, రాహుల్ ద్రవిడ్ నిర్ణయించగా సందీప్ శర్మ కూడా అతనికి బౌలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. చివరికి సందీప్ శర్మ బౌలింగ్ వేశాడు. మరోవైపు కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌లను రంగంలోకి దించాలనుకున్నాడు. కానీ రాహుల్ ద్రవిడ్ మరోసారి హెట్మెయర్‌ను ముందుంచాడు. సంజు నిర్ణయాన్ని రాజస్థాన్ జట్టు యాజమాన్యం దీనికి అంగీకరించకపోవడంతో రాహుల్ ద్రవిడ్ నిర్వహించిన సంప్రదింపులలో కూడా సంజు శాంసన్ పాల్గొనలేదు. దీనికి సంబంధించిన వీడియో విడుదలై అభిమానుల్లో వివాదానికి కారణమైంది. అంతే కాకుండా రాజస్థాన్ జట్టులో కెప్టెన్సీ విషయంలో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ మధ్య వివాదం చెలరేగిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో రాజస్థాన్ జట్టు నేడు లక్నో జట్టుతో ఆడనుంది.
ఓటమి
జట్టు స్ఫూర్తి గురించి కూడా ద్రవిడ్ పాజిటివ్‌గా స్పందించారు.“మేము ఓడినప్పుడు విమర్శలు రావడం సహజం. కానీ వారు ఎంతగా బాధపడతారో ప్రజలు అర్థం చేసుకోరు. వారు ఎంత కష్టపడి పనిచేస్తారో తెలుసు, నన్ను ఎంతో ప్రభావితం చేస్తారు. ఇదిలా ఉండగా, సంజు శాంసన్ గాయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సంజు 19 బంతుల్లో 31 పరుగులు చేసి, గాయం కారణంగా వెళ్ళిపోయాడు.ఆ మ్యాచ్ టైగా ముగిసి, రాజస్థాన్ సూపర్ ఓవర్‌లో ఓటమి పాలైంది.సంజు శాంసన్ ప్లేయింగ్ రాబోయే మ్యాచ్‌లో భాగం కాకపోతే, జట్టు మరోసారి కెప్టెన్‌ను మార్చాల్సి ఉంటుంది. అతని స్థానంలో, రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహించడాన్ని చూడొచ్చు. ఈ సీజన్ ప్రారంభంలో, రియాన్ మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Read Also: Kalyan Ram: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్