📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారు:హర్భజన్ సింగ్

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారని, మిగతా ఆటగాళ్ల ఫ్యాన్స్ అంతా పెయిడ్ అనిటీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా(Akash Chopra)తో కలిసి మాట్లాడిన హర్భజన్ సింగ్ 43 ఏళ్ల వయసులో ధోనీ ఐపీఎల్ ఎందుకు ఆడుతున్నాడో వివరించాడు. ఈ క్రమంలో ఇతర ఆటగాళ్ల ఫ్యాన్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.’ధోనీ ఎన్ని సంవత్సరాలు ఆడాలనుకుంటే అన్ని ఏళ్లు ఆడగలడు. అతను నా జట్టులో ఉంటే నేను వేరే నిర్ణయం తీసుకునేవాడిని. కానీ అభిమానులు ధోనీ ఆడాలని కోరుకుంటున్నారు. ధోనికి నిజమైన అభిమానులు ఉన్నారు. మిగతా ఆటగాళ్ల ఫ్యాన్స్ అంతా పెయిడ్. డబ్బులు తీసుకొని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానం చూపుతారు. వారి గురించి మాట్లాడటం అనవసరం. వారి గురించి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది.’అని హర్భజన్ సింగ్(Harbhajan Singh వ్యాఖ్యానించాడు. పక్కనే ఉన్న ఆకాశ్ చోప్రా ఇంత నిజాయితీగా మాట్లాడకూడదని చెప్పాడు. వెంటనే హర్భజన్ సింగ్ ఎవరైనా నిజాయితీగానే ఉండాలని బదులిచ్చాడు.

Sports: ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారు:హర్భజన్ సింగ్

ఆగ్రహం

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ హర్భజన్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రంజీ మ్యాచ్‌(Ranji match)కు వచ్చిన జనాలను చూసి ఈ విషయం మాట్లాడాలని కోహ్లీ ఫ్యాన్స్‌ హర్భజన్ సింగ్‌కు చరుకలంటిస్తున్నారు. ధోనీకి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో రోహిత్, కోహ్లీలకు కూడా అంతే స్థాయిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో సెలెబ్రిటీలకు పీఆర్స్ ఉండటం సహజమేనని, ఈ సోషల్ మీడియా కాలంలో పీఆర్స్ లేని ప్రముఖులు లేరని చరుకలంటిస్తున్నారు.పీఆర్స్ ఉన్నంత మాత్రానా కోహ్లీ, రోహిత్‌కు నిజమైన అభిమానులు లేరని హర్భజన్ సింగ్ చెప్పడం సరికాదన్నాడు. నిజమైన ఫ్యాన్స్ లేనిదే లైఫ్ రిస్క్ చేసి మైదానాల్లోకి వెళ్లి కోహ్లీ, రోహిత్(Kohli, Rohit) కాళ్లు మొక్కారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు కోహ్లీ, రోహిత్ శర్మకు నిజమైన ఫ్యాన్స్ లేకుంటే ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌కు క్రేజ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని హర్భజన్ సింగ్‌కు చురకలంటిస్తున్నారు.

Read Also: Sports: కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

#CricketControversy #HarbhajanSingh #MSDhoni #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.