हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: మరోసారి ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు !

Anusha
IPL 2025: మరోసారి ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు !

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా, ఫ్రాంచైజీలు క్రికెట్ అసోసియేషన్స్ మధ్య వార్ కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ల మధ్య గొడవ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం హెచ్‌సీఏ బ్లాక్ మెయిల్ చేస్తుందని, హైదరాబాద్‌ను వీడుతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరకు హెచ్‌సీఏ తలొగ్గి చర్చలు జరపడంతో గొడవ సద్దుమణిగింది.

తొమ్మిది పరుగుల

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) జ‌ట్టు అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోతోంది. ఆ జట్టు ప్రస్తుతం రెండు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక‌, గెలుపు ముంగిట బోల్తా ప‌డ‌డం అభిమానుల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. గ‌త రెండు మ్యాచుల్లో ఇదే జ‌రిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో కేవలం తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆ త‌ర్వాత‌ సూపర్ ఓవర్‌లో మ్యాచ్‌ను కోల్పోయింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ), రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) అడ్‌హక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహాలు వ్యక్తం చేశారు.హోమ్ గ్రౌండ్‌లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 IPL 2025: మరోసారి ఐపీఎల్ లో  ఫిక్సింగ్ ఆరోపణలు !

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఆర్‌సీఏకు విలువ ఇవ్వడం లేదని, పూర్తిగా పక్కనపెట్టిందని ఆరోపించారు. ‘రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అడ్‌హక్ కమిటీని నియమించింది. ఈ కమిటీని ఐదోసారి పొడిగించింది. ఆర్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్‌లు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. కానీ ఐపీఎల్ వచ్చే సరికి జిల్లా పరిషత్ బాధ్యతలు తీసుకుంటుంది.ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఆర్‌సీఏకు మాత్రమే లేఖ పంపింది. కానీ సవాయి మాన్సింగ్ స్టేడియం నుంచి మాకు ఎంఓయూ లేదని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ సాకు చెబుతోంది.ఎంఓయూ లేకపోతేనేం ప్రతీ మ్యాచ్‌కు జిల్లా పరిషత్‌కు రెంట్ చెల్లిస్తున్నారు? కదా?’అని జైదీప్ ప్రశ్నించారు. ప్రస్తుతం జైదీప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలోనే గతంలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Read Also: IPL 2025: కోల్‌కతాపై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870