📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 6:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సొంతం చేసుకున్న నొవాక్ జకోవిచ్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అతను వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ చరిత్రలో 100 విజయాలు సాధించిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇది ఒక గొప్ప క్రీడా ఘనత మాత్రమే కాకుండా, స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం.మూడో రౌండ్‌లో తన స్వదేశీయుడైన సెర్బియా ఆటగాడు మియోమిర్ కెమనోవిచ్‌ (Miomir Kemanovich) పై 6-3, 6-0, 6-4 తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకున్నాడు. నొవాక్ జకోవిచ్ కంటే ముందు మార్టినా నవ్రతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.నొవాక్ జకోవిచ్ తన 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో ఏడింటిని ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో గెలుచుకున్నాడు. శనివారం కెమనోవిచ్‌పై సెంటర్ కోర్టులో తొలి సెట్‌లో 3-3 స్కోరు నుంచి వరుసగా 9 గేమ్స్ గెలిచి సునాయాసంగా తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు. నాకు ఇష్టమైన టోర్నమెంట్‌ (Tournament) లో నేను ఏ చరిత్ర సృష్టించినా దాని పట్ల నేను కృతజ్ఞుడను” అని నొవాక్ జకోవిచ్ కోర్టులో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

టైటిళ్లను సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు

38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. తదుపరి మ్యాచ్ 11వ సీడ్ అలెక్స్ డి మినార్‪తో ఉంటుంది. మహిళల విభాగంలో 9 సార్లు వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్ మార్టినా నవ్రతిలోవా 120 సింగిల్స్ గెలుపొందగా పురుషుల విభాగంలో 8 సార్లు ఛాంపియన్ రోజర్ ఫెదరర్ 105 సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించాడు.తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 428 వారాలుగా పీఐఎఫ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌ (PIF ATP Rankings) లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నొవాక్ జకోవిట్, ఇప్పుడు తన 8వ వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి రోజర్ ఫెదరర్ రికార్డు టైటిళ్లను సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ఈ ట్రోఫీని గెలిస్తే ఓపెన్ ఎరాలో పురుషుల ‘మేజర్’ సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు.

Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత

జానిక్ సిన్నర్

గత నెల రోలాండ్ గారోలో నొవాక్ జకోవిచ్ క్లే-కోర్టులోతన 100వ మ్యాచ్ విజయాన్ని సాధించాడు. బెల్గ్రేడ్‌కు చెందిన నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్ మాత్రమే రెండు వేర్వేరు స్లామ్‌లలో 100 మ్యాచ్‌లు గెలిచిన పురుష ఆటగాళ్లుగా నిలిచారు. రోలాండ్ గారోలో జానిక్ సిన్నర్ చేతిలో సెమీ-ఫైనల్‌లో ఓడిపోయే ముందు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) తన 101వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 100 విజయాలకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్‌కు రికార్డు స్థాయిలో 10 ట్రోఫీలు ఉన్నాయి. యూఎస్ ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్ 90 మ్యాచ్‌లతో 4 టైటిళ్లను గెలుచుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

#CenturyClub #Djokovic100Wins #DjokovicVsKecmanovic #GrandSlamRecords #MartinaNavratilova #MiomirKecmanovic #NovakDjokovic #RogerFederer #SerbianTennis #TennisGOAT #TennisLegend #TennisMilestone #Wimbledon2025 #WimbledonChampion #WimbledonHistory Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.