📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: రిటైర్మెంట్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదు: ధోనీ

Author Icon By Anusha
Updated: May 8, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను సొంతమైదానంలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.ప్లేఆఫ్‌ నుంచి నిష్క్రమించిన సీఎస్‌కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి రిటైర్మెంట్‌పై(Dhoni Retirement ) ప్రశ్న ఎదురవగా భావోద్వేగానికి గురయ్యాడు.ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. వారంతా తనపై చాలా ప్రేమను కురిపించారన్నారని తెలిపాడు. అయితే, తనకు ఏ సీజన్‌ చివరి సీజన్‌ అవుతుందో తెలియనది చెప్పాడు. అయితే, తన కెరీర్‌ చివరిదశలో ఉన్నానని తెలిపాడు. కానీ, వెంటనే రిటైర్‌ అయ్యే ఉద్దేశం లేదని రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. తనకు 43 సంవత్సరాల వయసు అని ఎవరూ మరచిపోవద్దని తాను చాలాకాలంగా క్రికెట్‌ ఆడుతున్నానని చెప్పాడు. తాను కెరీర్ చివరి దశలో ఉన్నాననేది వాస్తవమని దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదని తాను రెండు నెలలు మాత్రమే ఆడతానని తెలిపాడు. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు కష్టపడాల్సి ఉంటుందని ఈ లీగ్ ఒత్తిడిని శరీరం తట్టుకోగలదా లేదా అని చూడాలని ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదన్నాడు. కానీ, నేను చూసిన అభిమానుల ప్రేమ, ఆప్యాయత అద్భుతమైందని చెప్పాడు. ఈ సందర్భంగా సీఎస్‌కే(CSK) జట్టును ధోనీ అభినందించాడు. కేకేఆర్‌పై జట్టు సాధించింది మాడో మ్యాచ్‌ మాత్రమేనని నవ్వుతూ తెలిపాడు. చాలా విషయాలు జట్టుకు అనుకూలంగా రాలేదని తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలని టీమ్‌ సభ్యులకు సూచించాడు.

Dhoni Retirement

పరుగులు

జట్టులో 25 మంది ఉన్నారని ప్రస్తుతం ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ఏ బ్యాట్స్‌మన్ ఎక్కడ ఎవరు ఎక్కడ బౌలర్ ఎక్కడ బౌలింగ్ చేయగలరు అనే దానికి వచ్చే ఏడాదికి సమాధానాలు కావాలన్నాడు. అందరూ పరుగులు చేయడం అరుదని కొన్ని సార్లు అవుట్‌ అవుతారని,కానీ, ఎవరికి వారు విశ్వాసంతో ఉన్నప్పుడే పరుగులు రాబట్టరని చెప్పుకొచ్చాడు. బ్యాట్స్‌మెన్‌ అనుకున్న షాట్లు ఆడాలని సూచించాడు. శివం దూబేతో మైదానంలో జరిగిన చర్చపై మాట్లాడుతూ,కేకేఆర్‌(KKR) స్పిన్నర్లు ఒత్తిడిని పెంచకుండా ఆపాలని చెప్పానని తెలిపాడు. బ్రేవిస్‌తో కలిసి దూబే కలిసి అదే పని చేశాడని గుర్తు చేశాడు. సునీల్‌, నరైన్‌లకు వికెట్లు ఇవ్వొద్దని అప్పుడు మనం ఎందుకు గెలవగలమో లేదో చూద్దామని చెప్పానని,మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లాలని సూచించినట్లు ధోనీ వివరించాడు.

Read Also :IPL 2025: (KKR)కేకేఆర్‌పై సీఎస్‌కే ఘన విజయం

#ChennaiSuperKings #CSKVictory #CSKvsKKR #IPL2025 #KolkataKnightRiders Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.