📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Navjot Singh Siddhu: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బుమ్రా సరైనవాడన్న సిద్ధూ

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్ని విధాలా సరైన వ్యక్తి అని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో సిద్ధూ(Navjot Singh Siddhu) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొద్ది రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దరిమిలా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త టెస్టు కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, “ప్రస్తుతం భారత టెస్టు జట్టు కొన్ని క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టును సరైన మార్గంలో నడిపించాలంటే బలమైన నాయకుడు అవసరం. అదే సమయంలో, కెప్టెన్‌కు జట్టు సభ్యుల నుంచి పూర్తి మద్దతు కూడా ఉండాలి. గత ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఏం జరిగిందో మనమంతా చూశాం. అయితే, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది, అతనికి ఆమోదం లభిస్తోంది. కానీ, భారత జట్టును ఒక్కతాటిపై నడిపించగల సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉందని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు.

Navjot Singh Sidhu: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బుమ్రా సరైనవాడన్న సిద్ధూ

అభిప్రాయాలను

బుమ్రాకు తాను ఎందుకు మద్దతిస్తున్నానో వివరిస్తూ, “విదేశీ గడ్డపై బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. అతని నిబద్ధత, ఆటతీరు ప్రశంసనీయం. నేను శుభ్‌మన్‌ గిల్‌కు వ్యతిరేకిని కాను. కానీ, అతను ప్రధానంగా బ్యాటర్. అతన్ని ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో ఆడించాలి. ఇక నాలుగో స్థానం కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి వారిని పరిశీలించవచ్చు. కరుణ్‌ నాయర్‌(Karun Nair) కూడా ఒక ఆప్షన్. అయితే, ఆ స్థానానికి నా మొదటి ఎంపిక మాత్రం కేఎల్ రాహులే” అని సిద్ధూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. బుమ్రా నాయకత్వం జట్టుకు మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read Also : Sports: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించిన గంభీర్

#BumrahForCaptain #JaspritBumrah #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.