हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే

Anusha
Latest News: Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్ ముగిసినా, దాని ప్రభావం ఇంకా క్రికెట్ ప్రపంచంలో కొనసాగుతూనే ఉంది. భారత్‌ చేతిలో పరాజయం పొందిన పాకిస్థాన్ జట్టు, ముఖ్యంగా పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ప్రవర్తన వల్ల ఎక్కువగా ట్రోఫీ వివాదం చర్చకు దారి తీసింది.సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి ఆసియా కప్‌ను గెలుచుకుంది.

Alcaraz: జపాన్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌

అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే సాధారణంగా జరిగే ట్రోఫీ ప్రదానోత్సవం ఈసారి అసలు జరగలేదు. కారణం, భారత జట్టు మేనేజ్‌మెంట్ ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ (Trophy) తీసుకోవడానికి నిరాకరించడం. దీనితో ఆగ్రహానికి గురైన నఖ్వీ, మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజ్‌పై ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని రద్దు చేసి, ట్రోఫీని,మెడల్స్‌ను వెంటనే తీసుకెళ్లారు.

ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైంది.పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. బీసీసీఐ (BCCI) కిఆయన క్షమాపణలు తెలిపారు. అయితే, ట్రోఫీని తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం ఆయన ఓ కొత్త మెలిక పెట్టారు. కప్పు కావాలంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్వయంగా దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని షరతు విధించారు.

ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీకి చెందినదని

ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న‌ జరిగిన ఏసీసీ (ACC) సమావేశంలో నఖ్వీ తన వైఖరిని మార్చుకున్నారు. ఫైనల్ రోజున జరిగిన ఘటనపై బీసీసీఐకి విచారం వ్యక్తం చేశారు. పరిస్థితి అంతగా ముదరకుండా ఉండాల్సిందని ఆయన అంగీకరించినట్టు సమాచారం.

Mohsin Naqvi
Mohsin Naqvi

అయితే, ఇదే సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla), నఖ్వీ ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీకి చెందినదని, పీసీబీ చీఫ్‌కు కాదని స్పష్టం చేశారు. గెలిచిన జట్టుకు ఇవ్వకుండా ట్రోఫీని, పతకాలను తన హోటల్ గదికి తీసుకెళ్లడం సరికాదని విమర్శించారు. తక్షణమే ట్రోఫీని భారత జట్టుకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్రోఫీని ఆయన తనతో తీసుకెళ్లే హక్కు లేదని

దీనికి ముందు, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) మాట్లాడుతూ, పాకిస్థాన్ సీనియర్ నాయకుడైన నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని తాము స్పృహతోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతమాత్రాన ట్రోఫీని ఆయన తనతో తీసుకెళ్లే హక్కు లేదని, ఇది చాలా దురదృష్టకరమని, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

తాజాగా నఖ్వీ క్షమాపణ చెప్పినప్పటికీ, ట్రోఫీని తిరిగి ఇచ్చేందుకు పెట్టిన షరతును బీసీసీఐ వెంటనే తిరస్కరించింది. ఫైనల్ జరిగిన రోజున అవసరం లేనిది, ఇప్పుడు భారత కెప్టెన్ ట్రోఫీ కోసం దుబాయ్ ఎందుకు వెళ్లాలని ప్రశ్నించింది. ఈ వివాదం భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870