📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ను వీడనున్న మిచెల్ స్టార్క్?

Author Icon By Anusha
Updated: May 16, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ పునప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇకపై ఐపీఎల్ 2025లో ఆడడు. మిచెల్ స్టార్క్ గురువారం విమానాశ్రయంలో కనిపించాడు. అప్పుడు ఒక అభిమాని విమానాశ్రయంలో మిచెల్ స్టార్క్ వీడియోను చిత్రీకరించడం ప్రారంభించాడు. ఆ వీడియోలో స్టార్క్ ఒక అభిమానిపై కోపంగా ఉన్నట్లు కూడా కనిపించింది. మిచెల్ స్టార్క్ లేకుండానే జట్టు ముందుకు సాగడానికి ఇప్పుడు సిద్ధమవుతోంది.అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తదుపరి మ్యాచ్ మే 18న గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతుంది.మిచెల్ స్టార్క్ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మిచెల్ స్టార్క్ తన సామానును ట్రాలీలో పెడుతున్నాడు. అప్పుడు స్టార్క్‌ను ఒక అభిమాని వీడియో తీశాడు.స్టార్క్‌కు అది నచ్చలేదు. అప్పుడు మిచెల్ స్టార్క్ కోపంగా అభిమానిని వెళ్లిపోమని గట్టిగా చెప్పాడు.

https://twitter.com/VividInsaan/status/1923084662697504960?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1923084662697504960%7Ctwgr%5Ea5ad16c80837993a865fca9936263a412875d151%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.mykhel.com%2Fcricket%2Fipl-2025-big-blow-to-delhi-capitals-mitchell-starc-pulls-out-of-tournament-094247.html

ఏరోసిటీ

ఐపీఎల్ 2025లో మిగతా మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ యాజమాన్యానికి తెలియజేశాడు. భారత్‌కు తిరిగి వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు స్టార్క్ లేకుండానే ముందుకు సాగడానికి ఢిల్లీ సిద్ధమవుతోంది. కాగా మిచెల్ స్టార్క్(Mitchell Starc) టోర్నీలో ఆడకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. విదేశీ ఆటగాళ్లలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర మాత్రమే ఉన్నాడు. ఫాఫ్ డుప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. జట్టు మెంటర్ కెవిన్ పీటర్సన్(Kevin Peterson) మే 16న శిబిరానికి తిరిగి వస్తాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ మే 18న అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతుంది. మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శుక్రవారం ఏరోసిటీలోని తన ఫ్రాంచైజీ సౌకర్యంలో ప్రాక్టీస్ చేస్తోంది. గుజరాత్ టైటాన్స్ మే 15 సాయంత్రం ఢిల్లీ చేరుకుంది. వారి ప్రాక్టీస్ మ్యాచ్ మే 16న జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఢిల్లీ జట్టు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ జోస్ బట్లర్ స్థానంలో కుశాల్ మెండిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బట్లర్ ప్లేఆఫ్స్‌లో ఆడడని తెలుస్తోంది.

Read Also: Kohli: కోహ్లీ సంతోషంగా ఆటకు వీడ్కోలు పలికాడు:రవిశాస్త్రి

#delhicapitals #IPL2025 #MitchellStarc #StarcOutOfIPL Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.