భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కివీస్ గెలిచింది. డారిల్ మిచెల్ ఫామ్ కొనసాగితే టీ20 సిరీస్‌ను కూడా సులువుగా గెలుస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ధీమా వ్యక్తం చేశారు. వన్డే సిరీస్ గెలుపులో డారిల్ మిచెల్ కీలక పాత్ర పోషించారని, వరుసగా 84, 131 నాటౌట్, 137 పరుగులు చేశారని తెలిపారు. గతంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన మిచెల్, ఇప్పుడు ఆ లోపాన్ని అధిగమించి, భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని సాంట్నర్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఇది మంచి సన్నాహకమని ఆయన తెలిపారు.
Read Also: Big Bash League: BBL లో ఫిన్ అలెన్ సరికొత్త చరిత్ర
చివరి సిరీస్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు(బుధవారం) ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ముందు రెండు జట్లకు ఇదే చివరి సిరీస్ కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గత కొన్ని నెలలుగా న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాలు భారత అభిమానులను కలవరపెడుతున్నాయి.
జట్లు ఇలా ఉన్నాయి!
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, అర్ష్‌దీప్,రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా.
న్యూజిలాండ్: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, ఈష్ సోధి, రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్, మ్యాట్ హెన్రీ తదితరులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: