📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Michael Atherton: ఐసీసీ టోర్నీల విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) టోర్నమెంట్‌ల డ్రా విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఐసీసీ మేజర్ ఈవెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచడం కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధానం ఆట యొక్క నిష్పక్షపాతతను దెబ్బతీస్తోందని, ఇకపై డ్రా ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని అథర్టన్ (Michael Atherton) డిమాండ్ చేశారు.

IND W vs PAK: పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్‌ (2025 Asia Cup) లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదు.

కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది” అని ఆయన అన్నారు.భారత్-పాక్ మ్యాచ్‌ (India-Pakistan match) కు ఉన్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలమ్‌లో పేర్కొన్నాడు.

Michael Atherton

ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్

2023-27 సైకిల్‌కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లుగా ఉందని గుర్తుచేశాడు. “ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్, ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారింది.

కేవలం డబ్బు కోసం ఒక క్రీడాసంస్థ తమ టోర్నమెంట్ ఫిక్చర్‌లను మార్చుకోవడంలో అర్థం లేదు” అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) (ACC) కూడా ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని,

ఆసియా కప్ ఫార్మాట్‌ను ఒకే నెలలో మూడుసార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా ఫర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Breaking News ICC criticism ICC draw system ICC tournaments ICC transparency India Pakistan Cricket latest news Michael Atherton Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.