ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌కి రానున్నాడు. భారత పర్యటనలో భాగంగా ఈ అర్జెంటీనా స్టార్ హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మెస్సీ హైదరాబాద్ రానుండటంతో నగరంలో క్రీడా సందడి మొదలైంది. వచ్చే నెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ (Lionel Messi) గౌరవార్థం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి జొమాటో యాప్, వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి.
Read Also: Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో హిట్ మ్యాన్

టికెట్ ధర 30 వేలు
ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో ఓ సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అనంతరం మెస్సీని సన్మానించి, ఒక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌బాల్ అభిమానులు, క్రీడా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.టికెట్ల ధరలను నిర్వాహకులు రూ.1750 నుంచి రూ.30,000 వరకు నిర్ణయించారు.
ప్రస్తుతం రూ.2,000, రూ.3,250, రూ.5,000, రూ.7,000, రూ.8,000, రూ.13,500 కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన రూ.30,000 టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక హాస్పిటాలిటీ సదుపాయాలు కల్పించనున్నారు.
మెస్సీ మొదట ఏ క్లబ్‌తో ఫుట్‌బాల్ ఆడాడు?
తన స్వస్థల క్లబ్ గ్రాండోలి కోసం చిన్న వయసులోనే ఆడాడు.
మెస్సీ బార్సిలోనా అకాడమీలో ఎప్పుడు చేరాడు?
మెస్సీ 13 ఏళ్ల వయసులో లా మాసియా (FC Barcelona Academy) లో చేరాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: