📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Sports: ఆర్సీబీ జట్టులో చేరిన లుంగీ ఎంగిడి

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.శనివారం నుంచి ఐపీఎల్‌ పున:ప్రారంభం కానుంది.ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు పరిస్థితులు సర్దుమణగడంతో తిరిగి భారత్‌కు చేరుకుంటున్నారు. బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్రకారం మే 17న తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి కీలక విదేశీ ఆటగాడు భారత్‌కు తిరిగి వచ్చాడు.దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి భారత్‌కు తిరిగి వచ్చాడు. లుంగీ ఎంగిడి ఇండియాకు తిరిగి వచ్చి ఆర్సీబీ జట్టులో చేరాడు. లుంగీ ఎంగిడి పునరాగమనంతో ఆర్సీబీ, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫాస్ట్ బౌలర్(Fast bowler రాబోయే మ్యాచ్‌లలో చాలా కీలక పాత్రను పోషించబోతున్నాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ తిరిగి రావడానికి మొగ్గు చూపడం లేదని తెలిసింది. ఈ క్రమంలో లుంగి ఎంగిడి ముఖ్య పాత్రను పోషించాల్సి ఉంటుంది.ఇది కాకుండా ఆర్సీబీ(RCB) తరఫున ఆడేందుకు మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు కూడా భారత్‌కు తిరిగి వస్తున్నారు. ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్న ఆర్సీబీ పవర్ హిట్టర్ రొమారియో షెపర్డ్ ఇండియాకు తిరిగి వస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. రొమారియో షెపర్డ్(Romario Shepherd ఒకే ఓవర్లో 30 పరుగులు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడితో పాటు ఇంగ్లాండ్‌కు చెందిన జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఆర్సీబీలో చేరబోతున్నారు.

Sports: ఆర్సీబీ జట్టులో చేరిన లుంగీ ఎంగిడి

వెస్టిండీస్

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి మ్యాచ్ మే 17న కోల్‌కతాతో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలని జట్టు కోరుకుంటోంది.ఇదిలా ఉండగా కేకేఆర్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్(Andre Russell, Sunil Narine) కూడా మరికొన్ని గంటల్లో ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు. ఇండియాకు వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఆండ్రీ రెస్ట్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆండ్రీ రస్సెల్‌తో పాటు రొమారియో షెపర్డ్, సునీల్ నరైన్, కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో ఉన్నారు. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది.

Read Also: PSL 2025: బాబర్ ఆజంను ట్రోల్ చేసిన సామ్ బిల్లింగ్స్ ఎందుకంటే?

#IPL2025 #LungiNgidi #NgidiIsBack #RCB2025 #RCBUpdates Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.