📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Krunal Pandya: టైటిల్ గెలుస్తామని నా సోదరుడికి చెప్పానన్న కృనాల్

Author Icon By Anusha
Updated: June 4, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో కృనాల్(2/17) అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఈ సందర్భంగా మాట్లాడిన కృనాల్ పాండ్యా(Krunal Pandya) ఆర్‌సీబీలో చేరిన క్షణమే టైటిల్ గెలుస్తానని చెప్పానని, ఆ మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ‘మా బ్యాటింగ్ సమయంలో డకౌట్‌లో కూర్చున్న నేను మా బ్యాటర్లతో పిచ్ గురించి చర్చించాను. స్లోయర్ బాల్స్ ఆడటం కష్టంగా ఉందని మా బ్యాటర్లు చెప్పారు. దాంతో ఎంత నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అంత మంచిదనే విషయం అర్థమైంది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఇలా బౌలిగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే స్లోయర్ బాల్స్ వేసే సమయంలో తప్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్యాటింగ్‌

నన్ను నేను నమ్ముకున్నాను. వేగాన్ని మార్చుకొని బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. పరిస్థితులను అందిపుచ్చుకోవడం నా ప్రధాన బలం. నేను ఎప్పుడూ నా సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుంటాను. ఈ రోజు కూడా ధైర్యంగా ఉంటేనే వికెట్లు తీయగలనని గ్రహించాను. ఈ వికెట్‌పై వేగంగా బౌలింగ్ చేసుంటే బ్యాటింగ్‌కు అనుకూలంగా మారేది. స్లోయర్ బాల్స్‌కు పిచ్ నుంచి సహాయం లభించింది. తొలి ఇన్నింగ్స్‌తో పోల్చితే రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ మెరుగైంది. నేను ఆర్‌సీబీలో చేరినప్పుడే ట్రోఫీలు గెలవడం నాకు ఇష్టమని చెప్పాను. మూడున్నర నెలల తర్వాత, నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. 10 ఏళ్లలో నాలుగు ట్రోఫీలు గెలవడం ఆనందంగా ఉంది. హార్దిక్ పాండ్యాకు కూడా టైటిల్ గెలుస్తామని ఫోన్‌లో చెప్పాను. 10 ఏళ్లలో పాండ్యా కుటుంబంలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయన్నాను.’అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Krunal Pandya: టైటిల్ గెలుస్తామని నా సోదరుడికి చెప్పానన్న కృనాల్

ఫలితం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తలో వికెట్ తీసారు.అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.

Read Also: RCB vs PBKS: పంజాబ్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

#IPL2025Final #KrunalPandya #PlayerOfTheMatch #RCBChampion Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.