📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: కోహ్లీ వల్లే టెస్ట్ క్రికెట్‌కు క్రేజ్: రవి శాస్త్రి

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది.మరో 2-3 ఏళ్లు ఆడుతాడనుకున్న కోహ్లీ ఇలా ఎందుకు వీడ్కోలు పలికాడో ఎవరికి అర్థం కాలేదు. కోహ్లీ కూడా రిటైర్మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించలేదు. సంతోషంగా సంతృప్తిగా ఆట నుంచి వైదొలుగుతున్నట్లు తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) మధ్య శనివారం బెంగళూరు వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ టెస్ట్ జెర్సీలను ధరించి వచ్చారు. కోహ్లీకి ఘన వీడ్కోలు పలకాలని భావించారు. కానీ కుండపోత వర్షం వారి ప్రణాళికలను దెబ్బతీసింది. మరోవైపు మైదానంలోని స్క్రీన్‌పై విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ గణంకాలను ప్రదర్శించారు.ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి విరాట్ కోహ్లీ టెస్ట్ గణంకాలపై మాట్లాడుతూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.కోహ్లీ కారణంగానే టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెరిగిందన్నాడు.కోహ్లీ దూకుడు నిలకడైన ఆటతోనే ప్రేక్షకులు మళ్లీ సంప్రదాయ క్రికెట్‌ను చూడటం మొదలు పెట్టారని, కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును చూసేందుకు జనాలు ఎదురు చూసేవారని తెలిపాడు. టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ కంటే గొప్ప ప్రచారకర్త లేడని అభిప్రాయపడ్డాడు.

Sports: కోహ్లీ వల్లే టెస్ట్ క్రికెట్‌కు క్రేజ్: రవి శాస్త్రి

బాధ్యత

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ ప్రకటించే వారం ముందు కోహ్లీ తనతో మాట్లాడాడని రవిశాస్త్రి తెలిపాడు. మానసికంగా అలసిపోవడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిపాడు. ‘కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి వారం రోజుల ముందు నాతో మాట్లాడాడు. ఆటలో రాణించాల్సినంత రాణించాననే స్పష్టతతో కోహ్లీ ఉన్నాడు. రిటైర్మెంట్(Retirement ప్రకటించినందుకు కోహ్లీలో ఎలాంటి బాధ లేదు. చాలా సంతోషంగా ఆటకు వీడ్కోలు పలికాడు. అతని నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది. అతనిలో మరో రెండు, మూడేళ్లు ఆడే సత్తా ఉంది. శారీరకంగా కూడా ఫిట్‌గా ఉన్నాడు. కానీ మానసికంగా బాగా అలసిపోయాడు.సాధారణంగా ఓ ఆటగాడు తన బాధ్యతను పూరి చేసి ప్రశాంతంగా ఉంటాడు. కోహ్లీ మాత్రం జట్టు బరిలోకి దిగినప్పుడు అన్ని వికెట్లు తానే తీయాలి, అన్ని క్యాచ్‌లు తానే పట్టాలి, అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి అన్నట్లు వ్యవహరిస్తాడు. ఆట తీవ్రత ఆ స్థాయిలో ఉంటే మానసికంగా అలసిపోక తప్పదు.’అని రవిశాస్త్రి(Ravi Shastri) చెప్పుకొచ్చాడు.

Read Also : KKR :ప్లేఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ నిష్క్ర‌మ‌ణ‌!

#IndianCricket #KohliLegacy #RaviShastri #TestCricket #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.