हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

KL Rahul : గోయెంకాతో విభేదాలు స్పందించిన కేఎల్ రాహుల్

Anusha
KL Rahul : గోయెంకాతో విభేదాలు స్పందించిన కేఎల్ రాహుల్

ఐపీఎల్ గత సీజన్ కేఎల్ రాహుల్‌ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అతను లక్నోలో భాగంగా ఉన్నాడు. చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని అతనిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.లైవ్ మ్యాచ్ సమయంలో, సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తరువాత కేఎల్ రాహుల్ చాలా కోపంగా కనిపించాడు.ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని మెగా వేలంలో కొనుగోలు చేసింది. ఆ తరువాత ఈ విషయంపై ఎప్పుడు మాట్లాడలేదు. తాజాగో ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.

హాట్ టాపిక్

లక్నోపై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించడంలో కీలక పోత్ర పోషించిన కేఎల్ రాహుల్ తన మాజీ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకాతో మాట్లాడటానికి నిరాశ వ్యక్తం చేశాడు. గోయెంకా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటానికి ప్రయత్నించిన కూడా అందరిముందే మైదానంలో అస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది. కేఎల్ రాహుల్ గత సీజన్ లో తనను అవమానించిన గోయెల్ కు గట్టి బుద్ధి చెప్పాడని అంటున్నారు.ఈ క్రమంలోనే మ్యాచ్ విజయం తర్వాత కేఎల్ రాహుల్ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. “లక్నోలో తిరిగి పంజుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతి.” అని రాసుకొచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు మెగా వేలానికి ముందు సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ ఒకరినొకరు అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాహుల్ అన్న ఘాటు మాటలను సోషల్ మీడియా ట్రెండింగ్ చేస్తున్నారు.

https://twitter.com/kitts1727/status/1914734228442628478?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1914734228442628478%7Ctwgr%5E7fdabaaaae664ea02c6e9352286d2cd93d6e072f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.mykhel.com%2Fcricket%2Fkl-rahul-posts-always-good-to-be-back-in-lucknow-after-dc-win-against-lsg-owner-sanjiv-goenka-092457.html

కేఎల్ రాహుల్

సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ”ఆటగాళ్లు గెలవాలనే తపనతో ఆడాలి. గెలవాలనే మనస్తత్వంతో ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆకాంక్షల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించే వారితోనే ఉండటం మంచిది. అలాంటివారినే రిటైన్‌ చేసుకోవాలని అనుకుంటాం” అని అన్నారు.రాహుల్ మాట్లాడుతూ,వారు ఈ నిర్ణయం ముందే తీసుకున్నారు. మేనేజ్‌మెంట్ ఏమన్నదో తెలియదు. ఇక నుంచి నా ప్రయాణం కొత్తగా మొదలు పెడతాను. నాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ దొరికే వాతావరణంలో ఆడతాను. కొన్ని సందర్భాల్లో కొన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్లిపోవడమే మంచిది. అదే మనకు కూడా మంచిది.ఢిల్లీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చాలా ఒత్తిడి ఉంది. ఇప్పటికే దానిని ఎదుర్కొన్నాం. నేను అలసిపోయానంటూ, పరుగులు చేయలేనంటూ విమర్శలు గుప్పించారు. కానీ, కాలమే అన్నింటికి సమాధానం ఇస్తుంది. చివరికి నాకే మంచి జరిగింది.అని కేఎల్ రాహుల్ సమాధానమిచ్చాడు.రూ.28,390 కోట్ల ఎల్‌ఎస్‌జీ యజమానికి తన తప్పును తెలుసుకునేలా చేస్తున్నాడు. లక్నో రిషబ్ పంత్‌ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ, పంత్ ధరలో సగం ఉన్న కేఎల్ రాహుల్ ఆడటం చూసినప్పుడల్లా, సంజీవ్ గోయంకా బాధపడుతున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సంజీవ్ గోయెంకాకు కేఎల్ రాహుల్ నుంచి ఇంతకంటే మంచి సమాధానం ఇంకేం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Suresh Raina : చెన్నై సూపర్ కింగ్స్‌కు గెలవాలనే కసి లేదు: సురేశ్ రైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870