📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

IPL 2025: (KKR)కేకేఆర్‌ ఓటమి పై అజింక్యా రహానే ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: May 8, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను సొంతమైదానంలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.ప్లేఆఫ్‌ నుంచి నిష్క్రమించిన సీఎస్‌కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది.గెలిస్తే గానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) సత్తాచాటడంలో విఫలమైంది. ఫలితంగా ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. సొంత ఇలాఖాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సీఎస్‌కే వెళుతూ వెళుతూ కోల్‌కతా అవకాశాలకు ఘోరంగా గండికొట్టింది.లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ ఐదింటిలో గెలిచి, ఆరింటిలో ఓడి ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతున్నది.మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా మిగతా జట్ల గెలుపు, ఓటములపై కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.  

ఓవర్ మ్యాచ్

ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఓటమికి గల కారణాలను వివరిస్తూ నిరాశను వ్యక్తం చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 2 వికెట్ల తేడాతో ఈ‌ పరాజయం మాకు చాలా కష్టమైన విషయమని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. తాము 10-15 పరుగులు తక్కువగా ఉన్నామని తెలిపాడు. ఈ పిచ్‌పై 185-195 పరుగుల స్కోరు ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. కేకేఆర్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని కానీ ఓటమిని భరించడం ఇంకా కష్టమని తెలిపాడు.డెవాల్డ్ బ్రెవిస్ ఒకే ఓవర్లో 30 పరుగులు చేశాడని ఇది టీ20 ఫార్మాట్‌లో జరుగుతుందని అజింక్యా రహానే(Ajinkya Rahane) చెప్పుకొచ్చాడు. కేవలం ఒకే ఓవర్ మ్యాచ్ గమనాన్ని మార్చగలదన్నాడు.డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నాడు. వారి ధైర్యం ఫలించిందని రహానే స్పష్టం చేశాడు. మాకు ఎటువంటి ఫిర్యాదులు లేవని కేకేఆర్ బౌలర్లు తమ శాయశక్తులా ప్రయత్నించారన్నాడు. తాము తదపరి రెండు మ్యాచ్‌లలో గెలవడానికి ప్రయత్నిస్తామన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ రహానే చెప్పుకొచ్చాడు.

పరుగులు

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేకేఆర్ తరఫున కెప్టెన్ అజింక్యా రహానే అత్యధిక పరుగులు చేశాడు. రహానే 33 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. దీనితో పాటు మనీష్ పాండే 28 బంతుల్లో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది కాకుండా ఆండ్రీ రస్సెల్ 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. కేకేఆర్ నుంచి ఏ బ్యాటర్ కూడా అర్థ సెంచరీ చేయలేకపోయారు,లక్ష్య ఛేదనలో సీఎస్కే కి (CSK)మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఆయుష్ మాత్రే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. డెవాన్ కాన్వే కూడా 2 బంతుల్లోనే డకౌట్ అయ్యాడు. అయితే మూడో స్థానంలో ఉర్విల్ పటేల్ 11 బంతుల్లో 33 పరుగులు చేసి ఫాస్ట్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో 52 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే కూడా 40 బంతుల్లో 45 పరుగులు చేసి తెలివిగా బ్యాటింగ్ చేశాడు. చివరికి సీఎస్కే 2 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

Read Also: Sports: రిటైర్మెంట్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదు: ధోనీ

#AjinkyaRahane #ChennaiSuperKings #CSKvsKKR #CSKWin #IPL2025 #KKRLoss #KolkataKnightRiders Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.