📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Karun Nair: కరుణ్ నాయర్ ఎంపిక చాలా మంచి నిర్ణయం: సునీల్ గవాస్కర్

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్(Shubman Gill) ను ఎంచుకుంది బీసీసీఐ,ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించింది.టీమిండియాకు నాల్గవ అతిపిన్న వయస్కుడిగా కెప్టెన్ అయ్యాడు. రిషబ్ పంత్(Rishabh Pant) ను వైస్ కెప్టెన్ గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. ఈ నేపథ్యం లోసునీల్ గవాస్కర్ సర్ఫరాజ్ ఖాన్‌ ఫై సంచలన వ్యాఖ్యలు చేసాడు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో పాటు గాయంతో ఆటకు దూరమవ్వడం సర్ఫరాజ్‌ ఖాన్ వేటుకు కారణమైందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇది కఠిన నిర్ణయమేనని అభిప్రాయపడిన సునీల్ గవాస్కర్ కరుణ్ నాయర్ సెలెక్షన్‌ను మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 18 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో కరుణ్ నాయర్‌కు అవకాశం దక్కగా సర్ఫరాజ్ ఖాన్‌ చోటు కోల్పోయాడు.

సెలెక్టర్లు

టీమ్ సెలెక్షన్‌పై ఇండియా టుడేతో మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ నిలకడగా రాణించడంతోనే సెలెక్టర్లు ఎంపిక చేశారని చెప్పాడు. ‘జయదేవ్ ఉనాద్కత్(Jaydev Unadkat) కూడా చాలా చిన్న వయసులోనే తొలి టెస్ట్ ఆడాడు. రెండో టెస్ట్ ఆడేందుకు అతనికి 13 ఏళ్ల సమయం పట్టింది. అయినా అతను పట్టు వదలకుండా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా వికెట్లు తీసాడు. ఉనాద్కత్‌లానే కరుణ్ నాయర్(Karun Nair) కూడా నిలకడగా రాణిస్తూ 8 ఏళ్ల తర్వాత అవకాశం అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో శతకాలు నమోదు చేయడంతోనే సెలెక్టర్లు కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పించారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడటం కూడా కరుణ్ నాయర్‌కు కలిసొచ్చింది.

తదుపరి మ్యాచ్‌

కరుణ్ నాయర్ ఎంపిక చాలా మంచి నిర్ణయం.అయితే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేయడం మాత్రం కఠినమైన నిర్ణయమనే చెప్పాలి. క్రికెట్ అంటేనే ఇది. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోని జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఓ మ్యాచ్‌లో సెంచరీ చేసినా తదుపరి మ్యాచ్‌కు ఫ్రెష్‌గా బరిలోకి దిగాలి. గత మ్యాచ్‌లో సెంచరీ చేసానులే అనే ఆలోచనతో ఉండకూడదు. జట్టు నుంచి వేటు వేసేలా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. అయితే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. గాయంతో రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. దాంతో ఫామ్ ఎంటో చూపించుకునే అవకాశం అతనికి లేకుండా పోయింది.’అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Read Also : IPL 2025: ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం: కరుణ్ నాయర్

#KarunNair #SarfarazKhan #SunilGavaskar #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.