📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు

Jitesh Sharma: ఈ ఓటమితో మా తప్పిదాలు తెలిసొచ్చాయన్న జితేష్ శర్మ

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)పై విజయం సాధించింది.టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. సాల్ట్‌(62) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సాల్ట్‌, కోహ్లీ జోరుతో ఆర్‌సీబీకి అదిరిపోయే శుభారంభం దక్కినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ బ్యాటింగ్‌ గత సీజన్‌ను గుర్తుచేసింది. 

సమయంలో

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జితేష్ శర్మ(Jitesh Sharma) పేలవ బౌలింగ్, చెత్త షాట్లు తమ విజయవకాశాలు దెబ్బతీసాయని చెప్పాడు. గెలిచే పరిస్థితుల నుంచి ఎలా ఓడిపోయామో అర్థం కావడం లేదన్నాడు. ‘మేం బౌలింగ్‌లో 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. అయినా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. గెలిచే పరిస్థితుల నుంచి ఎలా ఓడిపోయామో నాకు అర్థం కావడం లేదు. బ్యాటింగ్‌లో మేం కాస్త నిర్లక్ష్యంగా ఆడాం. మాలో ఇంటెన్సిటీ లోపించింది. కీలక సమయంలో నేను ఔటవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. టీమ్ డేవిడ్‌ గాయపడటంతో నేను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాను.అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం మంచిదే అయ్యింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మరింత రాటు దేలుతాం. రాబోయే మ్యాచ్‌లకు పకడ్బందీగా బరిలోకి దిగుతాం. ఈ మ్యాచ్‌లో ఓడినా మేం బాగానే బ్యాటింగ్ చేశాం. ఈ మ్యాచ్‌లో మాకు అదే సానుకూలాంశం.’అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.

Jitesh Sharma: ఈ ఓటమితో మా తప్పిదాలు తెలిసొచ్చాయన్న జితేష్ శర్మ

రన్‌రేట్

తాజా పరాజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. 42 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. దాంతో 17 పాయింట్లు ఉన్నా మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించినా టాప్-2లో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also : SRH vs RCB: ఆర్‌సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం

#CricketMindset #JiteshSharma #LearningFromDefeat #PostMatchReaction Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.