భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం(మే17) నుంచి పున:ప్రారంభం కానుంది. మొత్తం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్‌ను సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ మ్యాచ్(final match) జరగనుంది. శనివారం ఆర్‌సీబీ, కోల్‌కతా మధ్య బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై వేదికగా 13 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను త్వరలో ప్రకటించనున్నారు. భద్రతా కారణాలతో రద్దయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరగాల్సిన రెండు లీగ్ మ్యాచ్‌లను కూడా తరలించారు.
రీషెడ్యూల్
మే 17: ఆర్‌సీబీ vs కేకేఆర్, బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు),మే 18: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు),మే 18: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు),మే 19: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో (రాత్రి 7:30 గంటలకు),మే 20: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు),మే 21: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై (రాత్రి 7:30 గంటలకు),మే 22: గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు),,మే 23: ఆర్‌సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు),మే 24: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, జైపూర్ (రాత్రి 7:30 గంటలకు),మే 25: గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు),మే 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కేకేఆర్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు),మే 26: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, జైపూర్ (రాత్రి 7:30 గంటలకు),మే 27: లక్నో సూపర్ జెయింట్స్ vs ఆర్‌సీబీ, లక్నో (రాత్రి 7:30 గంటలకు),మే 29: క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు),మే 30: ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు),జూన్ 1: క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)జూన్ 3: ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు).
Read Also: Chess in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో ఇక చెస్ ఆడేందుకు వీలు లేదు