📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ పై స్పందించిన భారత క్రికెటర్లు

Author Icon By Anusha
Updated: May 7, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే ) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది.ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిపై ప్రతీకారంగా మురిడ్కేలో భారత ఆర్మీ దాడులు చేసింది.ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే.

ప్రతినిధి

ఇక భారత సైన్యం దాడులు చేసినట్టు పాకిస్థాన్‌ నిర్ధారించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌ పూర్‌ ప్రాంతాలపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడినట్టు పాక్ వెల్లడించింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఈ మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.మరోవైపు శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్‌, ధర్మశాల, లేహ్‌ ఎయిర్‌పోర్టులను భారత్‌ మూసివేసినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలానే మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది రక్షణ శాఖ.

వీరేంద్ర సెహ్వాగ్

భారత ప్రభుత్వ చర్యపై గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా సహా అనేక మంది ప్రముఖ భారత క్రికెటర్లు స్పందించారు. ఇప్పుడు క్రికెటర్లు “జై హింద్” అంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు.పహల్గాంలో జరిగిన బాధాకరమైన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుని పాకిస్థాన్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. భారత్ తరఫున టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆపరేషన్ సిందూర్ పోస్టర్‌ను ట్వీట్ చేసి ‘జైహింద్’ అని రాసుకొచ్చారు. గంభీర్ ట్వీట్ ను వేలాది మంది లైక్ చేశారు.భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆపరేషన్ సిందూర్ గురించి ట్వీట్ చేశాడు. ‘ధర్మో రక్షతి రక్షితః, జై హింద్ కీ సేన’ అని సెహ్వాగ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఈ దాడి తర్వాత ట్వీట్ చేసి ‘మనమందరం కలిసి నిలబడదాం.. జై హింద్’ అని రాశారు.

Read Also : VIP fight at Stadium : చిన్నస్వామి స్టేడియంలో వీఐపీల సీటు కోసం ఘర్షణ!

#GautamGambhir #IndianCricketers #JaiHind #SureshRaina #VirenderSehwag Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.