భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే ప్రతి క్రికెట్ పోటీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది పురుషుల మ్యాచ్ అయినా సరే, మహిళల మ్యాచ్ అయినా సరే అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది.అయితే, ఈరోజు భారత్, పాక్ మహిళల జట్ల మధ్య కీలక పోరు జరుగుతోంది.
Srikanth: అతడు గంభీర్ కు ఇష్టమైన ఆటగాడు: శ్రీకాంత్
చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన పోరులో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Pakistan captain Fatima Sana) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ల మధ్య కరచాలనం (హ్యాండ్‌షేక్) జరగకపోవడం గమనార్హం.టాస్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేస్తామని.. వాతావరణం బాగుందని,
వికెట్ (Wicket) పై కొద్దిగా తేమ ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఈరోజు తమ ప్రణాళికలను మెరుగ్గా అమలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. ఛేదించడానికి 250 పరుగుల కంటే తక్కువ లక్ష్యం మంచిదేనన్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.
జట్టులో ఓ మార్పు ఉందని – సోహైల్ స్థానంలో సదాఫ్ జట్టులోకి వచ్చిందని పాక్ కెప్టెన్ పేర్కొన్నారు.అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Indian captain Harmanpreet Kaur) మాట్లాడుతూ.. ప్రపంచ కప్ కు ముందు ఇక్కడ మంచి సిరీస్ ఆడామని తెలిపారు.
తాము సానుకూలంగానే ఆలోచిస్తున్నామని.. బాగా ఆడాలని చూస్తున్నట్లు తెలిపారు. భారత జట్టులో ఓ మార్పు జరిగిందని.. ఈ మ్యాచ్ లో అమన్‌జ్యోత్ (Amanjyoth) ఆడడం లేదని.. ఆమె స్థానంలో రేణుక ఠాకూర్ జట్టులోకి వచ్చిందని తెలిపారు.
తుది జట్లు ఇవే..
భారత్ ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్పాకిస్తాన్ ప్లేయింగ్ XI: మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమిన్, ఆలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా (కెప్టెన్), రమీన్ షమిమ్, డయానా బైగ్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), నష్రా సంధు, సాదియా ఇక్బాల్
Read hindi news: hindi.vaartha.com
Read Also: