हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: IND vs WI: ఓటమి పై వెస్టిండీస్ కెప్టెన్ ఏమన్నారంటే?

Anusha
Latest News: IND vs WI: ఓటమి పై వెస్టిండీస్ కెప్టెన్ ఏమన్నారంటే?

వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోస్టన్‌ చేజ్‌ (West Indies captain Roston Chase) అహ్మదాబాద్‌లో ముగిసిన తొలి టెస్టులో తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌ వైఫల్యమే ఈ ఘోర ఓటమికి కారణమని ఆయన స్పష్టం చేశారు.

IND vs WI: అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతోనే గెలిచాం: మహమ్మద్ సిరాజ్

ముఖ్యంగా తమ జట్టు బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం, ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ త్వరగానే వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించిందని చెప్పారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించకపోవడం వల్లే టీమిండియా (Team India) పై ఒత్తిడి తీసుకురాలేకపోయామని చేజ్‌ పేర్కొన్నారు.

‘టాస్ గెలిచి 160 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ఇది మేం ఆశించిన ప్రదర్శన కాదు. ముఖ్యంగా భారత్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయడంపై ఫోకస్ పెట్టాలి.

మేం విఫలమవ్వడం మా విజయవకాశాలను దెబ్బతీసింది

ముఖ్యంగా బంతి టర్న్ అవుతున్నప్పుడు, పిచ్ పాడవుతూ.. ఆట నాలుగో, ఐదోరోజు వరకు వెళ్తున్న పరిస్థితుల్లో మేం విఫలమవ్వడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ విషయంపై ఫోకస్ పెట్టాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ (Batting) ఎంచుకునే నిర్ణయం ఏ మాత్రం తప్పుకాదు. వికెట్‌పై కాస్త తేమ ఉన్నప్పటికీ.. ముందు బ్యాటింగ్ చేయాలని అంతా అనుకున్నారు.

కానీ ఇది టెస్ట్ వికెట్ (Test wicket), తొలి రోజు ఆటలో తేమ ఉండటం సహజం. కానీ బ్యాటర్లు తమ సత్తాను చాటాలి.రెండో కొత్త బంతిని ఎంచుకున్న సమయం కూడా తప్పు కాదు. రెండో కొత్త బంతితోనూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయామని భావిస్తున్నా. బ్యాటర్ల టెక్నిక్‌ను ఇంకాస్త ఎక్కువగా పరీక్షించాల్సింది.

 IND vs WI
 IND vs WI

మా ప్రధాన సమస్య బ్యాటింగ్‌లోనే ఉంది

వారిని ముందుకు నడిపించేలా ప్రయత్నించాలి. బహుషా స్టంప్స్‌కు మరింత దగ్గరగా బౌలింగ్ చేయాలి. మా ప్రధాన సమస్య బ్యాటింగ్‌లోనే ఉంది. మేం కనీసం 50 పరుగుల భాగస్వామ్యాలను కూడా నమోదు చేయలేకపోయాం. క్రికెట్‌లో బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా భాగస్వామ్యాలు కీలకం.

బ్యాటింగ్‌ (Batting) లో భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తేనే మాకు విజయం దక్కుతుంది.’అని రోస్టన్ ఛేజ్ చెప్పుకొచ్చాడు.286 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు కుప్పకూలింది. అలిక్ అథనాజే (74 బంతుల్లో 3 ఫోర్లతో 38), జస్టిన్ గ్రీవ్స్(52 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/31) మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్(2/23)కు రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies) కనీస పోటీ ఇవ్వలేకపోయింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870