📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs WI: అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతోనే గెలిచాం: మహమ్మద్ సిరాజ్

Author Icon By Anusha
Updated: October 4, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెస్టిండీస్‌ (West Indies)పై జరిగిన తొలి టెస్టులో భారత్ సాధించిన ఘన విజయం వెనుక పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్..కెప్టెన్ గా శుభ్ మన్ గిల్

ఈ విజయానికి సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి మొత్తం 7 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.ఈ విజయానంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సిరాజ్.. జట్టులో ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకొని ఆడారని తెలిపాడు.’ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.

మేం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాం. రెండో ఇన్నింగ్స్‌‌లో వికెట్ చాలా స్లోగా ఉంది. బంతి బ్యాట్‌పైకి అస్సలు రాలేదు. అందుకే ఇక్కడ మూడు వికెట్లు తీసినా.. ఐదు వికెట్లు పడగొట్టిన ఫీలింగ్ కలిగింది. భారత్‌లో రెండో ఇన్నింగ్స్‌ (innings) లో నేను వికెట్ తీయడం ఇదే తొలిసారి అని నాకు నిజంగా తెలియదు. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి.

ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆడారు

మా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆడారు. ఇంగ్లండ్ పర్యట నుంచి కేఎల్ రాహుల్ (KL Rahul) పరుగులు చేస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ కూడా బాగా ఆడుతున్నాడు. మిగతా బ్యాటర్లు కూడా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు.’ సిరాజ్ చెప్పుకొచ్చాడు.286 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

IND vs WI

అలిక్ అథనాజే (74 బంతుల్లో 3 ఫోర్లతో 38), జస్టిన్ గ్రీవ్స్(52 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు.భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/31) మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్(2/23)కు రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్‌ (Washington Sundar) కు ఒక వికెట్ దక్కింది.

పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో

పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.ఈ మ్యాచ్‌ (match) లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది.

కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Ahmedabad match Bowling Performance Breaking News India vs West Indies Test latest news Mohammed Siraj Siraj seven wickets Team India Victory Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.