న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ (IND vs NZ) ను భారత్ 1–2తో కోల్పోయింది. ఇందౌర్ వన్డేలో 41 పరుగుల తేడాతో ఓడటంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ లేదా బౌలింగ్ కాదని.. మన ఫీల్డింగ్ అని కుండబద్ధలు కొట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్‌తో జరిగిన చర్చలో గవాస్కర్ భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను తప్పుపట్టారు.
Read Also: India Open World Tour Super-750: వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆన్ సే-యంగ్
మిగతా జట్టులో ఆ చురుకుదనం లేదు
ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఫీల్డర్లు చూపిన ఉదాసీనత కివీస్ బ్యాటర్లకు వరంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. “నేను పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు కానీ, కొంతమంది ఆటగాళ్లు చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు. దీనివల్ల బౌలర్లు సృష్టించిన ఒత్తిడి మొత్తం నీరుగారిపోయింది” అని గవాస్కర్ మండిపడ్డారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్నప్పటికీ, మిగతా జట్టులో ఆ చురుకుదనం కనిపించలేదని ఆయన విమర్శించారు.సులభంగా స్ట్రైక్ రొటేట్ చేసే అవకాశం ఇవ్వడం వల్ల డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి బ్యాటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే సెటిల్ అయిపోయారని, ఇది కివీస్ స్కోరు బోర్డు వేగంగా కదలడానికి కారణమైందని విశ్లేషించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: