📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

India vs New Zealand – T20 World Cup Final : భారత బ్యాటర్ల ఊచకోత..న్యూజిలాండ్‌ కు భారీ టార్గెట్

Author Icon By Sudheer
Updated: March 8, 2026 • 9:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది టోర్నీలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. మరోవైపు సంజూ శామ్సన్ 89 పరుగులతో (46 బంతుల్లో) క్లాస్ ఇన్నింగ్స్ ఆడి, ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లేలోనే 92 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు.

Read Also : Kamareddy crime : కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

శాంసన్, అభిషేక్ జోరును ఇషాన్ కిషన్ కూడా కొనసాగించాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అవ్వడం, హార్దిక్ పాండ్యా త్వరగా పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం కాస్త తగ్గినట్లు అనిపించినా.. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26) తన ప్రతాపం చూపించాడు. చివరి ఓవర్‌లో వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో భారత్ 250 మార్కును దాటగలిగింది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్, భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రస్తుతానికి మ్యాచ్ భారత్ వైపే మొగ్గు చూపుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

India vs New Zealand T20 World Cup Final

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.