నాగ్‌పూర్ వేదికగా బుధవారం భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండోర్ వన్డేలో ఓటమితో ట్రోఫీని కోల్పోయిన టీమిండియా ఈ ఫార్మాట్‌లో కివీస్‌కు షాకివ్వాలనుకుంటోంది. టాస్ గెలిచిన బ్లాక్‌క్యాప్స్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ తీసుకున్నాడు.
Read Also: ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్.. రెండో స్థానంలో కోహ్లీ
ప్రాక్టీస్ సెషన్
టీ20 వరల్డ్‌కప్ 2026కి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఈ ఐదు టీ20ల సిరీస్ చాలా కీలకంగా మారింది. జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు ఈ సిరీస్ జరగనుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా ఈ సిరీస్‌లో ఆడే ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుండటంతో ఈ టీ20 సిరీస్ ప్రాక్టీస్ సెషన్‌గా మారనుంది.
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్కే, కైలీ జేమీసన్, ఇష్ సోధీ, జాకబ్ డఫ్ఫీ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: