📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

IND vs NZ: తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం

Author Icon By Aanusha
Updated: January 11, 2026 • 9:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌తో (IND vs NZ) మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ సమష్టిగా రాణించి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (93), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.

Read also: WPL 2026: గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs NZ) లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (26) ఓ మోస్తరు స్కోరుకే అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ ఔటైనా… కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (49) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.

సెంచరీకి చేరువైన దశలో కోహ్లీ ఔటవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వెంటనే రవీంద్ర జడేజా (4), అయ్యర్ కూడా ఔటవడంతో కివీస్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి.ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (29 నాటౌట్), హర్షిత్ రాణా (29) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రాణా వేగంగా ఆడి ఒత్తిడిని తగ్గించాడు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (7 నాటౌట్)తో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

IND vs NZ: India wins against New Zealand in the first ODI

రెండో వన్డే ఈ నెల 14న రాజ్ కోట్ లో జరగనుంది

కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు.

మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ (84) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడిన మిచెల్ జట్టు స్కోరును 300 మార్కుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 14న రాజ్ కోట్ లో జరగనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

India vs New Zealand latest news ODI Series Team India Telugu News Vadodara match

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.