ప్రస్తుతం టీమిండియా, శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మొదటి మ్యాచ్ లీడ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలవడమే గిల్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది.ఇప్పుడు సిరీస్‌లోని రెండో మ్యాచ్ జులై 2న ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) లో జరగనుంది. గిల్ కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో సెట్ అవ్వలేదని, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వెనుకబాటుగా ఉన్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి టెస్టులో బౌలింగ్ చక్కగా సాగుతున్న సమయంలో మార్పులు లేకపోవడం, ఫీల్డ్ సెట్టింగ్స్ (Field settings) లో అనిశ్చితి, ఒత్తిడిని తట్టుకునే నిర్ణయాల్లో లోపాలు వంటి అంశాలు విమర్శలకు దారితీశాయి.అయితే ఇప్పుడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గిల్‌కు మద్దతుగా కీలక ప్రకటన చేశాడు. ఒక విధంగా రవిశాస్త్రి శుభమన్ గిల్ కెప్టెన్సీపై సమయ పరిమితిని నిర్ణయించారు.
ఏది జరిగినా దానిలో ఎలాంటి మార్పు చేయవద్దు
టీమిండియా మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి సిరీస్‌లో 0-1తో వెనుకబడినప్పటికీ శుభ్‌మన్ గిల్‌కు సమయం ఇవ్వాలని, అతను సమయం, అనుభవంతో దీనికి అలవాటు పడతాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రవిశాస్త్రి మాట్లాడుతూ,”శుభ్‌మన్ గిల్‌ను మూడు సంవత్సరాల పాటు కెప్టెన్‌గా ఉండనివ్వండి. సిరీస్‌లో ఏది జరిగినా దానిలో ఎలాంటి మార్పు చేయవద్దు. మూడు సంవత్సరాలు అతనికి మద్దతు ఇవ్వండి. గిల్ బాగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను.” అని రవిశాస్త్రి పేర్కొన్నారు.మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) మాట్లాడుతూ“శుభమన్ గిల్ టాస్, ప్రెస్ కాన్ఫరెన్స్‌ల సమయంలో మీడియాతో సంభాషించే విధానాన్ని చూస్తుంటే శుభ్‌మన్ గిల్ చాలా పరిణతి చెందాడు. సెలెక్టర్లు, బీసీసీఐ శుభమన్ గిల్‌తో కాస్త ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది.” అని పేర్కొన్నారు.
ఎక్కువ పరుగులు
టీమిండియా ఓటమి తర్వాత శుభమన్ గిల్ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ బ్యాటింగ్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మొదటి మ్యాచ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. శుభమన్ గిల్ (Shubham Gill) బ్యాటింగ్‌లో కెప్టెన్సీ ఒత్తిడి అస్సలు కనిపించలేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇప్పుడు కెప్టెన్ శుభమన్ గిల్ ఎలాగైనా రెండో మ్యాచ్‌ను గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు తన కెప్టెన్ నుంచి అలాంటి అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తోంది.
Read Also: Wayne Larkins: ఇంగ్లీష్ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ ఇకలేరు