దేవరాజ్ ను ఐదవ రోజు విచారించిన అధికారులు
హైదరాబాద్: సంచలనం రేపిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల గోల్మాల్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో గత జూలై నెల తొమ్మిదవ తేదీన అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు కోశాధికారి శ్రీనివాసరావు, సీఈ ఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవితలను ఇప్పటికే ఆరురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన సిఐడి అధికారులు ఇదే కేసులో గత నెల 25వ తేదీన పట్టుబడ్డ హెచ్సిఎ కార్యదర్శి దేవరాజ్ను (Devaraj)వరుసగా ఐదవ రోజు కూడా విచారించారు.
హెచ్సిఎ స్కాంలో ఆరుగురి పాత్ర
హెచ్సిఎ స్కాంలో ఈ ఆరుగురి పాత్ర వుందని గతంలో దీనిపై విచారించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చడం తెలిసిందే. దీనిపై ఈడీ కూడా రంగంలోకి దిగడం విదితమే. బిసిసిఐ నుంచి అందిన వందల కోట్ల రూపాయల నిధులను హెచ్సిఎ పక్కదారి పట్టించి, సొంత అవసరాలకు వాడుకుందని సిఐడి విచారణలో తేలగా దీంతో పాటు గత ఐపిఎల్ సీజన్లో సన్రైజర్స్ జట్టును టికెట్ల కోసం బ్లాక్ మెయిలింగ్కు పాల్పడినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ (Vigilance Enforcement) నిగ్గు తేల్చింది.ఉప్పల్ స్టేడియంలో జరిగిన కోట్లాది రూపా యల పనులలో భారీగా అక్రమాలు జరిగాయని, హెచ్సిఎ అధ్యక్షుడుగా జగన్మోహన్ రావు ఎన్నికే అక్రమమని, మాజీ మంత్రి కృష్ణా యాదవ్ నెలకొల్పిన గౌలిగూడ క్రికెట్ క్లబ్ ను ఆయనకు తెలియకుండా సంతకం ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరిట ఓ క్లబ్ను తన వారిచేత తప్పుడు పత్రాలతో జగన్ మోహన్రావు ఏర్పాటు చేసినట్లు సిఐడి తేల్చింది.
దీని తరువాత ఇందులో తన వారినే నియమించి, తాను సభ్యు డుగా చేరి, ఆరు నెలలకే హెచ్సిఎ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందడం అంతా డ్రామాగా వుందని సిఐడి విచారణలో తేలింది. ఈ కేసులో మొదట అరెస్టయిన ఐదు గురు నిందితులు వెల్లడించిన సమాచారం ఆధా రంగా ఆ తరువాత పట్టుబడ్డ దేవరాజ్ను సిఐడి విచారిస్తోంది. ఇందులో భాగంగా దేవరాజ్ ఇంట్లో సోదాలు చేసిన సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియంలో జరిగిన అక్రమాలపై ఆయనను గంటల తరబడి ప్రశ్నించినట్లు తెలిసింది.అక్కడి రికార్డులను దేవరాజ్ ఎదుట వుంచి ప్రశ్నించి అన్ని విష యాలను నిగ్గు తేల్చినట్లు సమాచారం. దేవరాజ్ వెల్లడించిన సమాచారం ఆధారంగా మరికొందరిని విచారించేందుకు సిఐడి సిద్ధమవుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: