हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన హర్షల్ పటేల్

Anusha
IPL 2025: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన హర్షల్ పటేల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు(Play Off Race) నుంచి తప్పుకుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేదు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 2 పాయింట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పోతు పోతు లక్నోను కూడా తమ వెంట తీసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), ఎయిడెన్ మార్క్‌రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) దూకుడుగా ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా ఇషాన్ కిషన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), కామిందు మెండీస్(21 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/37) రెండు వికెట్లు తీయగా విల్ ఓ రూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసారు.

బౌలింగ్

 హర్షల్ పటేల్ ఐడెన్ మార్‌క్రమ్ వికెట్ తీసుకుని ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన బౌలర్‌గా హర్షల్ పటేల్ గొప్ప రికార్డును నమోదు చేశాడు.గతంలో ఐపీఎల్‌ సిరీస్‌లో లసిత్ మలింగ 2444 బంతుల్లో 150 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సిరీస్‌లో అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన రికార్డు అదే. ఐపీఎల్‌లో లసిత్ మలింగను ఒక లెజెండ్‌గా భావిస్తుండగా హర్షల్ పటేల్ ఇప్పుడు మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. హర్షల్ పటేల్ ఐడెన్ మార్‌క్రమ్ వికెట్ తీసుకునేటప్పుడు అతను ఐపీఎల్‌లో 2381 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు. హర్షల్ పటేల్ మలింగ కంటే 63 బంతులు తక్కువ వేసి 150 వికెట్లు పడగొట్టడం గమనార్హం.ఈ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ మూడో స్థానంలో ఉన్నాడు. చాహల్ 2543 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో 2656 బంతుల్లో 150 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా 2832 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు.

Read Also : IPL 2025: అభిషేక్ శర్మ, దిగ్వేష్ రతి మధ్య వివాదంతో చర్యలకు దిగిన బీసీసీఐ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870