📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Harjas Singh: చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ హర్జాస్ సింగ్ (Harjas Singh) తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. భారత సంతతికి చెందిన ఈ ప్రతిభావంతుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరు ఊహించని రీతిలో చరిత్ర సృష్టించాడు. శనివారం సిడ్నీలోని పాటర్న్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హర్జాస్ చూపిన ఆటను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.

Womens World Cup 2025: న్యూజిలాండ్‌ నుంచి ఆల్‌రౌండర్ ఫ్లోరా ఔట్

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరూ ఊహించని రీతిలో ట్రిపుల్ సెంచరీ బాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. శనివారం సిడ్నీలోని పాటర్న్ పార్క్‌లో వెస్ట్రన్ సబర్బ్స్ తరఫున ఆడిన హర్జాస్.. సిడ్నీ క్రికెట్ క్లబ్‌ (Sydney Cricket Club) పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కేవలం 141 బంతుల్లోనే 35 భారీ సిక్సర్ల సాయంతో 314 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.ఆస్ట్రేలియా గ్రేడ్ క్రికెట్ చరిత్రలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా హర్జాస్ నిలిచాడు.

అతని మూలాలు భారత్‌లోనే ఉన్నాయి

ఈ అద్భుత ప్రదర్శనతో, న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్-గ్రేడ్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు చేసిన ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.హర్జాస్ సిడ్నీ (Sydney) లో జన్మించినప్పటికీ, అతని మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు 2000 సంవత్సరంలో ఛండీగఢ్ నుంచి సిడ్నీకి వలస వెళ్లారు.

Harjas Singh

2024 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌ (2024 Under-19 World Cup Final) లో భారత్‌పై 55 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా హర్జాస్ అప్పట్లోనే వార్తల్లో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఈ రికార్డు ఇన్నింగ్స్‌పై ఫాక్స్ క్రికెట్‌తో హర్జాస్ మాట్లాడుతూ “నా కెరీర్‌లోనే ఇంత క్లీన్‌గా బంతిని బాదడం ఇదే మొదటిసారి.

హర్జాస్ మాట్లాడుతూ

ఆఫ్-సీజన్‌లో నా పవర్-హిట్టింగ్‌ (Power-hitting) పై చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఈరోజు ఫలించినందుకు గర్వంగా ఉంది” అని చెప్పాడు. గతంలో బయటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు కేవలం తన ఆటపైనే దృష్టి సారించానని పేర్కొన్నాడు.ఈ అసాధారణ ప్రదర్శన హర్జాస్ కెరీర్‌కు గొప్ప మలుపుగా మారే అవకాశం ఉంది.

అతని సహచరులైన శామ్ కాన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్ వంటి వారు ఇప్పటికే రాష్ట్ర స్థాయి జట్లకు ఆడుతుండగా, కాన్‌స్టాస్ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేశాడు. ఈ ట్రిపుల్ సెంచరీతో హర్జాస్ కూడా ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

australian cricketer Breaking News harjas singh harjas singh triple century indian origin cricketer latest news t20 triple century Telugu News western suburbs cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.