हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ముంబై ఇండియన్స్‌ విజయం పై స్పందించిన హార్దిక్ పాండ్యా

Anusha
IPL 2025: ముంబై ఇండియన్స్‌ విజయం పై స్పందించిన హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2025లో భాగంగా ,ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆతిథ్య జట్టును 7వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదుచేసి ప్లేఆఫ్స్‌ రేసులో మరో ముందడుగు వేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (44 బంతుల్లో 71, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్‌ మనోహర్‌ (43) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. నిర్ణీత ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/26), దీపక్‌ చాహర్‌ (2/12) ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఛేదనను ముంబై 15.4 ఓవర్లలోనే పూర్తిచేసింది.రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, మలింగా, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు.

సూర్యకుమార్‌

సన్‌రైజర్స్‌ తడబడ్డ పిచ్‌పై ముంబై లక్ష్యాన్ని సాఫీగా దంచేసింది. బౌండరీతో చేధన ప్రారంభించిన రికెల్టన్‌ (11) త్వరగానే పెవిలియన్‌ చేరినా చెన్నై మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన ముంబైచా రాజా (రోహిత్‌).. అదే జోరును కొనసాగించాడు. కమిన్స్‌ 3వ ఓవర్లో 6, 4 బాదిన హిట్‌మ్యాన్‌ బౌలింగ్‌లోనూ 4, 6 దంచాడు. మరో ఎండ్‌లో విల్‌ జాక్స్‌ (22) రోహిత్‌కు అండగా నిలవడంతో ముంబై స్వల్ప లక్ష్యాన్ని వేగంగా కరిగించింది. కమిన్స్‌ బౌలింగ్లో బౌండరీతో 35 బంతుల్లో రోహిత్‌ ఫిఫ్టీ పూర్తయింది. పదో ఓవర్లో అన్సారీ.. జాక్స్‌ను ఔట్‌ చేసినా ఆ ప్రభావం ముంబైపై పడలేదు. సూర్యకుమార్‌ (40) సాయంతో రోహిత్‌ ముంబై విజయాన్ని ఖాయం చేశాడు. విజయానికి 13 పరుగుల దూరంలో రోహిత్‌ ఔటైనా సూర్య, తిలక్‌ లాంఛనాన్ని పూర్తిచేశారు.

 
IPL 2025: ముంబై ఇండియన్స్‌ విజయం పై స్పందించిన హార్దిక్ పాండ్యా

ఆధిపత్యం

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో మా కుర్రాళ్లు మూమెంటమ్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతీ ఒక్కరు క్లిక్ అయితే మా జట్టు ఆధిపత్యం కొనసాగుతుందని నాకు ముందే తెలుసు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ అద్భుత బౌలింగ్‌తో మంచి ఆరంభం అందిస్తే.. రోహిత్ శర్మ, సూర్య సూపర్ బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.ఓవరాల్‌గా ఇదో అద్భుతమైన విజయం. పరిస్థితుల నేపథ్యంలోనే దీపక్ చాహర్‌తో వరుసగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాను. ముందస్తు ప్రణాళికలే కాకుండా పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించాలని కెప్టెన్‌గా తెలుసుకున్నా. పవర్ ప్లేలో దీపక్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు అతని ఆఖరి ఓవర్‌ను చివరి వరకు ఎందుకు ఆపాలి? ప్రతీ విభాగంలో మరింత మెరుగవ్వాలి. ఏది ఏమైనా మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది.’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Read Also: Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870