Shubman Gill: టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌

Read Time:  1 min
Shubman Gill: టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌
FONT SIZE
GET APP

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్(Shubman Gill) ను ఎంచుకుంది బీసీసీఐ,ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించింది.టీమిండియాకు నాల్గవ అతిపిన్న వయస్కుడైన కెప్టెన్ అయ్యాడు. రిషబ్ పంత్(Rishabh Pant) ను వైస్ కెప్టెన్ గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ లేకపోవడం భార‌త జ‌ట్టుకు పెద్ద లోటేన‌ని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) అన్నాడు. కానీ, మిగిలిన ప్లేయర్లకు మంచి అవకాశమని గౌతం గంభీర్ పేర్కొన్నాడు. “ఆట  ఎప్పుడు మొదలుపెట్టాలి ఎప్పుడు ముగించాలనేది పూర్తిగా ఆట‌గాళ్ల‌ వ్యక్తిగతం. ప్లేయ‌ర్ల‌కు కోచ్‌ అయినా, సెలక్టర్‌ అయినా రిటైర్‌ కావాలని చెప్పే హక్కు లేదు. ఎంతో అనుభవజ్ఞులైన విరాట్‌, రోహిత్‌ ఇప్పుడు టెస్టు జట్టులో లేకపోవడం లోటే. యువకులకు ఇది సువర్ణవకాశం” అని గంభీర్‌ చెప్పాడు.  

భార‌త జ‌ట్టు 

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌లకు ఇంగ్లాండ్ పర్యటనకు అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025లో షమీ ప్రత్యేకంగా ఏమి చేయలేకపోవడమే దీనికి కారణం. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ అతడిని జట్టులో చేర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్ దీప్‌, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్‌.

Read Also: Navjot Singh Siddhu: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బుమ్రా సరైనవాడన్న సిద్ధూ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.