Rinku Singh: విషాదం నుంచి మైదానానికి.. తిరిగి జట్టులోకి రింకూ సింగ్

Read Time:  1 min
Rinku Singh: విషాదం నుంచి మైదానానికి.. తిరిగి జట్టులోకి రింకూ సింగ్
FONT SIZE
GET APP

Rinku Singh: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న వేళ, సహచర ఆటగాళ్ల ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ రింకూ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం (ఫిబ్రవరి 27) కన్నుమూశారు. తండ్రి మరణ వార్త విన్న వెంటనే రింకూ సింగ్ చెన్నైలో ఉన్న జట్టును విడిచిపెట్టి, తన స్వగ్రామమైన అలీగఢ్‌కు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

Read Also: IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే

వెస్టిండీస్‌తో కీలక పోరు: ఈడెన్ గార్డెన్స్‌లో సెమీస్ బెర్త్ వేట

వ్యక్తిగత విషాదం నుంచి కోలుకుని రింకూ సింగ్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌కు ముందు జట్టు కోల్‌కతాలో సమావేశం కానుంది.”రింకూ రేపు జట్టుతో కలుస్తాడు” అని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా పీటీఐకి తెలిపారు.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు వెస్టిండీస్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ టీమిండియాకు వర్చువల్ నాకౌట్‌ లాంటిది. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ 1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. రింకూ సింగ్‌కు ఇదే తొలి ప్రపంచకప్ కాగా, ఈ టోర్నీలో మిడిల్ ఆర్డర్‌లో ఆడిన అతను ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 24 పరుగులు మాత్ర‌మే చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.