📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

French Open: ఫైనల్‌కు చేరిన అల్కరాస్, సినర్

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2025 సెమీ-ఫైనల్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాయి. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో జరిగిన ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు అంచనాలకు తగ్గకుండా తీవ్ర ఉత్కంఠతో సాగాయి. ఫురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో టాప్ సీడ్ జాన్సిక్ సినర్(Jancic Sinner), డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ అద్భుతమైన విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు.అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ పోరులో టాప్ జాన్సిక్ సినర్ పైచేయి సాధించాడు. ప్రపంచ నంబర్ వన్ సినర్, 24 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత జకోవిచ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్సిక్ సినర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సినర్ జకోవిచ్‌(jokovich)ను స్ట్రెయిట్ సెట్స్‌లో (6-4, 7-5, 7-6(7-3)) ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయం సినర్‌కు తొలి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు మార్గం సుగమం చేసింది. జకోవిచ్ తనదైన శైలిలో కొన్ని అద్భుతమైన షాట్‌లు ఆడినప్పటికీ, సినర్ నిలకడమైన ఆటతీరు ముందు నిలబడలేకపోయాడు. 2010 వింబుల్డన్ తర్వాత జకోవిచ్ ఒక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో స్ట్రెయిట్ సెట్స్‌లో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో గత 4 మ్యాచ్‌ల్లోనూ సినర్ చేతిలో జకోవిచ్ ఓడిపోయాడు.

గాయం కారణంగా

డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ మరోసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. లొరెంజో ముసెట్టి గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో అల్కరాస్(Alcaraz) ఫైనల్‌కు చేరుకున్నాడు. లొరెంజో ముసెట్టి 4-6, 7-6,6-0, 2-0 తేడాతో వెనుకబడి ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. మొదటి రెండు సెట్‌లు ఉత్కంఠగా సాగినప్పటికీ, ముసెట్టి గాయపడటంతో మ్యాచ్ ఏకపక్షంగా మారింది. అల్కారాజ్ వరుసగా రెండవ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

French Open

కీలక మ్యాచ్‌

మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ కొత్త చాంపియన్‌ను చూడబోతున్నది. మూడేండ్ల క్రితం ఈ టోర్నీ ఫైనల్‌ చేరి తృటిలో టైటిల్‌ కోల్పోయిన అమెరికా అమ్మాయి, రెండో సీడ్‌ కోకో గౌఫ్(Coco Gouf)  మరోసారి పట్టువదలకుండా ఫైనల్‌ చేరింది. గురువారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో సెమీస్‌లో గాఫ్‌ 6-1, 6-2తో ఫ్రాన్స్‌ సంచలనం బోయిసన్‌ను మట్టికరిపించి టాప్‌ సీడ్‌ అరీనా సబలెంక(Areena Sabalenka)తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఈ టోర్నీలో సంచలన విజయాలు సాధించిన బోయిసన్‌ కీలక మ్యాచ్‌లో మాత్రం గాఫ్‌ జోరు ముందు తేలిపోయింది. ఇక ముఖాముఖి పోరులో గాఫ్‌, సబలెంక 5-5తో సమంగా ఉన్నారు. ఫైనల్‌లో మట్టికోర్టు మహారాణిగా నిలిచేదెవరనేది శనివారం తేలనుంది.

Read Also: KL Rahul : ఇంగ్లాండ్ లయన్స్‌తో అనధికార టెస్టులో కేఎల్ రాహుల్ శ‌త‌కం

#CarlosAlcaraz#SinnerVsAlcaraz #FrenchOpen2025 #RolandGarros #Tennis Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.