📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: ENG vs SAW : ఇంగ్లాండ్ స్పిన్నర్ల అద్భుత ప్రదర్శన

Author Icon By Aanusha
Updated: October 3, 2025 • 6:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వన్డే వరల్డ్ కప్ 2025 (ODI World Cup 2025) మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు తమ పూర్తి ప్రతిభను ప్రదర్శించారు. ఇంగ్లండ్ బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్‌ను కుప్పకూల్చారు.గువాహటి వేదిక (Guwahati venue)గా జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు లినే స్మిత్ 3 వికెట్లు 7 రన్లకు, నాట్ సీవర్-బ్రంట్ 2 వికెట్లు 5 రన్లకు తీసుకోవడంతో దక్షిణాఫ్రికా సమష్టి బలహీనంగా నిలిచింది.

MS Dhoni: ధోనీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు : సాయి కిషోర్

మొత్తం 21 ఓవర్లలో 69 రన్లకే అవుట్ అయ్యారు, సఫారీ బ్యాటర్లు సమిష్టిగా విఫలమైన చోట వికెట్ కీపర్ సినాలో జఫ్తా 22 పరుగులతో టాప్ స్కోరర్‌ (Top scorer) గా నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఊదేస్తే ఇంగ్లండ్‌కు రెండు పాయిట్లతో పాటు భారీ రన్‌రేటుసొంతమైనట్టే.మహిళల వరల్డ్ కప్‌లో ఏకపక్ష మ్యాచ్‌కు తెరతీసింది ఇంగ్లండ్. మెగా టోర్నీ తొలి పోరులో బౌలర్లు రాణించడంతో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది.

టాపార్డర్ బ్యాటర్లు వెనుదిరుగుతున్నా

రెండో ఓవర్‌లోనే కెప్టెన్ లారా వొల్వార్డ్‌ (Captain Laura Wollward)(5)ను లినే స్మిత్ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు శుభారంభమిచ్చింది. ఆ తర్వాత.. తంజిమ్ బ్రిట్స్‌(5), సునే లుస్(2)లను బౌల్డ్ చేసిన స్మిత్ సఫారీలను దెబ్బతీసింది. అనంతరం.. మరినే కాప్‌ (4)సైతం పెవిలియన్ చేర్చిన ఆమె దక్షిణాఫ్రికాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. టాపార్డర్ బ్యాటర్లు వెనుదిరుగుతున్నా సినాలో జఫ్తా(22) ఒంటరిపోరాటం చేసింది.

కానీ, ఆమెను ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా (South Africa) కోలుకోలేకపోయింది.మరో ఎండ్‌ నుంచి .. నాట్ సీవర్ బ్రంట్(2-5), చార్లీ డీన్(2-14) పోటీపడుతూ వికెట్ల వేట కొనసాగించి సఫారీలను ఆలౌట్ అంచున నిలిపారు. చివరి వికెట్‌ అయిన మలబా(3)ను డీన్ బౌల్డ్ చేయడంతో సఫారీల ఇన్నింగ్స్ 69 పరుగులవద్ద ముగిసింది.

వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే మూడో అత్యల్ప స్కోర్. గతంలో.. 2009లో న్యూజిలాండ్‌పై 51కే ఆ జట్టు కుప్పకూలింది. పాకిస్థాన్‌పై 2019లో 63 రన్స్‌కే సఫారీ టీమ్ ఆలౌటయ్యింది. తక్కువ స్కోర్‌కు ఆలౌట్ కావడం ఇది మూడోసారి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News england bowlers performance Guwahati match latest news line smith 3-7 nat seabert brunt 2-5 one day world cup south africa batting collapse Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.