ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో భాగంగా,క్రికెట్ అభిమానులలో ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ పట్ల ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులు ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఈ 18వ సీజన్లలో అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని అనేక రికార్డులు సృష్టించబడ్డాయి. కొంత మంది బౌలర్లు కెప్టెన్లుగా రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల గురించి తెలుసుకుందాం.తొలి సీజన్‌లో దివంగత ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(Shane Warne) రాజస్థాన్ రాయల్స్‌ను విజయపథంలో నడిపించాడు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్‌లో కూడా వార్న్ తన ప్రతిభను కనబరిచాడు. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా షేన్ వార్న్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో షేన్ వార్న్ కెప్టెన్‌గా మొత్తం 57 వికెట్లు పడగొట్టాడు.ఈ జాబితాలో షేన్ వార్న్ తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) పేరు రెండో స్తానంలో ఉంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ముంబైకి ముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. కెప్టెన్‍గా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో కూడా హార్దిక్ వికెట్ తీస్తాడని, ఇది పాండ్యా రికార్డును మరింత మెరుగుపరచనుంది.
బౌలింగ్
హార్దిక్ పాండ్యా లాగే ఆసీస్ ఆటగాడు పాట్ కమ్మిన్స్ కూడా ఐపీఎల్‌లో యాక్టివ్ కెప్టెన్‌గా ఆడుతున్నాడు. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. బౌలింగ్‌లో కూడా పాట్ కమ్మిన్స్(Pat Cummins)అద్భుతాలు చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కమ్మిన్స్ మొత్తం 31 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో కమ్మిన్స్ కెప్టెన్సీలో మరిన్ని వికెట్లు తీస్తాడని భావిస్తున్నారు.భారత మాజీ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా చాలా కాలం పాటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్సీతోనే కాకుండా కుంబ్లే తన బౌలింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు.అనిల్ కుంబ్లే మొత్తం 30 వికెట్లు పడగొట్టాడు.భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కూడా తన బౌలింగ్‌తో ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. అశ్విన్ చాలా కాలం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్‌లో కూడా అశ్విన్ తన ప్రతిభను చూపించాడు. కెప్టెన్‌గా అశ్విన్ ఐపీఎల్‌లో 25 వికెట్లు పడగొట్టాడు.
Read Also : IPL 2025: కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎవరంటే?