📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: అంపైర్ల జీతం ఎంతో తెలుసా!

Author Icon By Anusha
Updated: April 18, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌  సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అనూహ్యమైన ఫలితాలతో ఈ సీజన్ ఇప్పటికే అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే క్రికెట్‌లో అంపైర్ల పాత్ర చాలా కీలకం. మ్యాచ్‌ సక్రమంగా జరిగేలా, ఆటగాళ్లందరూ రూల్స్‌ పాటించేలా చూడటం వారి పని. ఏది ఏమైనా ఈ ఆటలో అంపైర్లదే తుది నిర్ణయం. డీఆర్‌ఎస్ ద్వారా ఆన్‌ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలను సవాలు చేయవచ్చు. కానీ మూడో అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం లేదు.టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అంపైర్ల నిర్ణయాలపై కూడా నిఘా ఉంది. కొన్నిసార్లు అంపైర్లు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలను శాసిస్తాయి. కాబట్టి వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో అత్యుత్తమ అంపైర్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్ తరహాలోనే ఐపీఎల్‌లో కూడా ప్రతీ మ్యాచ్‌కు నలుగురు అంపైర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారు.నలుగురిలో ఇద్దరూ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించగా మరోకరు టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తారు. టెక్నాలజీ సాయంతో నిర్ణయాలను సమీక్షించడంతో పాటు కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తాడు. ఇంకొకరు ఫోర్త్ అంపైర్‌గా ఉంటారు. ఫోర్త్ అంపైర్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లకు రిజర్వ్ అంపైర్‌గా ఉంటాడు. మైదానంలో అంపైర్లకు సాయం చేయడం ఆటగాళ్లతో పాటు వారి బ్యాట్లను తనిఖీ చేయడం వంటి పనులు చేస్తాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్‌ గాయపడినా ఆసౌకర్యానికి గురైనా నాలుగో అంపైర్ బాధ్యతలు చేపడుతాడు. మెగా వేలం ద్వారా ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు జీతాలు అందిస్తుండగా ఫీల్డ్ అంపైర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ వేతనాలు అందిస్తోంది. అసలు ఒక్కో అంపైర్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం.

ఎలైట్ అంపైర్లు

ఐసీసీ ఎలైట్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.1,98,000 ఫీజుతో పాటు రూ. 12,500 అలవెన్స్‌ కింద అందజేస్తున్నారు. ఐసీసీ ఎలైట్ అంపైర్లు అంటే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేసేవారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నుంచి మైకేల్ గాఫ్, క్రిస్ గాఫెనీ,అడ్రైన్ హోల్డ్‌స్టాక్‌లు మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ ఎలైట్ అంపైర్లు ఓ సీజన్ పేరిట దాదాపు రూ. 7,33,000 వేతనం పొందుతారు.

అకామిడేషన్‌‌

దేశవాళీ క్రికెట్‌లో అంపైరింగ్ చేస్తున్నవారిని డెవలప్‌మెంట్ అంపైర్లుగా పిలుస్తారు. మరింత అనుభవం పొందేందుకు వీరికి ఐపీఎల్‌లో అంపైరింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. డెవలప్‌మెంట్ అంపైర్లు ఒక్కో మ్యాచ్‌కు రూ. 59,000 ఫీజు పొందుతారు. ఈసారి బీసీసీఐ కొత్తగా ఏడుగురు డేవలప్‌మెంట్ అంపైర్లకు అవకాశం కల్పించింది. స్వరూపానంద కన్నుర్, అభిజీత్ భట్టాచార్య, పరషార్ జోషి, అనిష్ సహస్త్రాబుద్దే, కెయుర్ కెల్కర్, కౌశిక్ గాంధీ, అభిజిత్ బెనర్జీ‌‌లు డేవలప్‌మెంట్ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి వెటరన్ అంపైర్లు ఎస్ రవి, సీకే నందన్‌లను మెంటార్లుగా బీసీసీఐ నియమించింది.అంపైర్లకు వేతనంతో పాటు హోటల్ అకామిడేషన్‌‌ను ఐపీఎల్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ అంపైర్లే అత్యధిక వేతనం పొందుతున్నారు. మిగతా ఫ్రాంచైజీ లీగ్‌లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో పాటు అనుభవం ఉన్నవారినే ఐపీఎల్ అంపైర్లుగా ఎంపిక చేస్తారు.

Read Also: Pat Cummins: ఎస్ఆర్ హెచ్ జట్టును వీడనున్న పాట్ కమిన్స్?

#CricketUmpires #DRS #IPL2025 #OnFieldUmpire #ThirdUmpire Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.